హైదరాబాద్ : లీకేజీలు, కలుషిత నీటి సరఫరాకు చెక్..! అందుబాటులోకి సరికొత్త వ్యవస్థ

కలుషిత నీటి ఫిర్యాదులను తగ్గించడానికి హైదరాబాద్ జలమండలి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. రోబోటిక్ టెక్నాలతో సమస్యల గుర్తింపును వేగవంతం చేయనుంది. ఆ దిశగా సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వివరాలను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు.

Published on: Jan 4, 2026, 09:00:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కలుషిత నీరు సరఫరాతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసింది. కలుషిత నీరు ఫిర్యాదులను 'జీరో'కు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత అధికారులతో శనివారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

రోబోటిక్ యంత్రం
రోబోటిక్ యంత్రం

ఆ వివరాలను విశ్లేషించండి - జలమండలి ఎండీ

ఈ సందర్భంగా జలమండలి ఎండీ మాట్లాడుతూ.. వివిధ కారణాలతో ప్రతినిత్యం కలుషిత నీరు ఫిర్యాదులు నమోదు అవుతాయన్నారు. వెంటనే అధికారులు స్పందించి.. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అయితే ఎం సీ సీ కి అందే కలుషిత నీరు ఫిర్యాదులు ఏయే ప్రాంతాల నుంచి అధిక ఫిర్యాదులు వచ్చాయో చూడాలని సూచించారు. తరచూ నమోదవుతున్న ఫిర్యాదుల ప్రాంతాల వివరాలను సేకరించి సమస్య మూలాలను విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు.

డివిజన్ వారీగా కాలం చెల్లిన పైపు లైన్ల వివరాలు, కలుషిత నీరు నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా, ఒకటి కంటే ఎక్కువ సార్లు ఫిర్యాదులు అందే ప్రాంతాల్లో పైపు లైన్ల వివరాలను సేకరించాలని చెప్పారు. ఆ ప్రాంతాల్లో పైపు లైన్ల పటిష్టతను అంచనా వేసి మార్చడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. వీటితోపాటు… కాలం చెల్లిన పైపు లైన్ల స్థానంలో కొత్త పైపు లైన్ల నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులు పూర్తి చేయడానికి సరైన కార్యాచరణ వెంటనే సమర్పించాలని దిశానిర్దేశం చేశారు.

రానున్న రెండు నెలల్లో పైప్ లైన్ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయడానికి సిద్ధం కావాలని అధికారులను కోరారు. దానికి సంబంచిన కొత్త పైప్ లైన్ నిర్మాణ పనుల అంచనాలు వెంటనే సమర్పించి ఆమోదం పొందాలని సూచించారు.

రోబోటిక్ టెక్నాలజీ సేవలు…

ఇప్పటికే కలుషిత నీరు కనిపెట్టేందుకు.. జలమండలి ఇప్పటికే కలుషిత నీరు, లీకేజీలు అరికట్టడానికి జలమండలి రోబోటిక్ టెక్నాలజీతో పనిచేసే పొల్యూషన్స్ ఐడెంటిఫికేషన్ మెషిన్ అనే యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని ఈ సందర్బంగా ఎండీ వివరించారు. దీన్ని పైప్ ఇన్ స్పెక్షన్ కెమెరా సిస్టం అని కూడా అంటారని వివరించారు. దీని ద్వారా కలుషిత నీటి సరఫరా, లీకేజీలను త్వరగా గుర్తించి సమస్యలను పరిష్కరిస్తామని అని చెప్పారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More