శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నానక్ రామ్ గూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో సీవరేజ్ సిస్టమ్ ను మెరుగుపరిచేందుకు హైదరాబాద్ జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంక్ మెయిన్లను అభివృద్ధి చేయడానికి మినీ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మినీ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ రూపొందిచండి - జలమండలి ఎండీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో గచ్చిబౌలి, నానక్ రాం గూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలను ఎండీ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఉత్పన్నం అవుతున్న మురుగు, ఇప్పటివరకు ఉన్న సీవరేజ్ లైన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తు అవసరాలను బట్టి సీవరేజ్ లైన్లను, ట్రంక్ మెయిన్ల అభివృద్ధికి మినీ సీవరేజ్ ప్లాన్ లను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న నాలాలు, వాననీటి కాలువలు, ట్రంక్ మెయిన్ల వివరాలను సేకరించి అధ్యయనం చేయాలని సూచించారు.
మూసీ , ఇతర సమీప చెరువుల్లో మురుగు చేరి కలుషితం కాకుండా వర్షపు నీటి కాలువల నుంచి మురుగునీటి పైపు లైన్లను వేరుచేయాలని ఎండీ అశోక్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. 2047 మాస్టర్ ప్లాన్ ఆధారంగా సీవరేజ్ ట్రంక్ మెయిన్ల, సబ్ సీవరేజ్ లైన్ల నిర్మాణంకోసం ప్రతిపాదనను సమర్పించాలని అన్నారు. ఇందుకోసం ఓ అండ్ ఎం, ఎస్టీపీ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. దీంతోపాటు నానక్ రామ్ గూడ ఎస్టీపీ క్యాచ్ మెంట్ ప్రాంతాల్లో ఉత్పన్నమయ్యే మురుగును అంచనావేసి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎస్టీపీ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్టీపీ విభాగ అధికారులకు సూచించారు.
గచ్చిబౌలి నుంచి కోకాపేట్ పరిసర ప్రాంతాల్లో ఉత్పన్నం అవుతున్న మురుగును కోకాపేట ఎస్టీపీకి తరలించాలని సూచించారు. శుద్ధి చేయడానికి సీవర్ ట్రంక్ మెయిన్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను కోరారు. అలాగే కోకాపేట్ దిగువనున్న ప్రాంతాలోని మురుగును సమీపంలోని చిత్రపురి, ఇబ్రహీం చెరువు ఎస్టీపీకి మళ్ళించడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
{{/usCountry}}గచ్చిబౌలి నుంచి కోకాపేట్ పరిసర ప్రాంతాల్లో ఉత్పన్నం అవుతున్న మురుగును కోకాపేట ఎస్టీపీకి తరలించాలని సూచించారు. శుద్ధి చేయడానికి సీవర్ ట్రంక్ మెయిన్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను కోరారు. అలాగే కోకాపేట్ దిగువనున్న ప్రాంతాలోని మురుగును సమీపంలోని చిత్రపురి, ఇబ్రహీం చెరువు ఎస్టీపీకి మళ్ళించడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
{{/usCountry}}నానక్ రాం గూడలోని 4.5 ఎమ్మెల్డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సందర్శించారు. మురుగుశుద్ధి ప్రక్రియను పరిశీలించిన ఎండీ..ఎస్టీపీ సామర్థ్యం, శుద్ధి నీటి నాణ్యత తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీప ప్రాంతాల్లోని ఉత్పన్నమయ్యే మురుగును ఈ ఎస్టీపీలో శుద్ధి చేసే సామర్థ్యం ఉందా..? లేకుంటే సామర్థ్యం పెంచడానికి, కొత్త ఎస్టీపీ నిర్మించడానికి సాధ్యసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
నానక్ రాంగూడ ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటిని గోల్ఫ్ కోర్టులో వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అందుకు ఓఆర్ఆర్ వెంట శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడానికి పైప్ లైన్ నిర్మించడానికి డీపీఆర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పైప్ లైన్ తో ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న గార్డెనింగ్ కి శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడానికి సంబంధించిన అధికారులతో మాట్లాడాలని చెప్పారు.