SIR Voter Status : ‘సర్’లో మీ ఓటు నమోదైందో లేదో ఒక్క SMSతో తెలుసుకోండి - ప్రాసెస్ ఇలా…
Special Intensive Revision Voter Status : ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో మీ ఓటు వివరాలు నమోదయ్యాయో లేదో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభం. మీ మొబైల్ నుంచి ఒక్క SMS పంపి పూర్తి సమాచారాన్ని నిమిషాల్లో పొందవచ్చు.
Special Intensive Revision Voter Status : రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ ఎంతో శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో బూత్ లెవల్ ఆఫీసర్లు (BLO) ద్వారా తమ ఓటరు వివరాలు విజయవంతంగా నమోదు అయ్యాయా లేదా అనే సందేహం చాలా మంది పౌరుల్లో వ్యక్తమవుతోంది.

ఓటు హక్కు ఉందో లేదో తెలియక, ప్రజాస్వామ్య ప్రక్రియలో తమ పేరు నమోదుపై ఆందోళన చెందుతున్న వారికి భారత ఎన్నికల సంఘం ఒక సులభమైన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా… స్మార్ట్‌ఫోన్ వాడకపోయినా సరే.. మీ చేతిలో ఉన్న సాధారణ కీప్యాడ్ మొబైల్ ఫోన్ ద్వారా ఒక్క SMS పంపి మీ SIR నమోదు స్థితిని నిమిషాల్లో ధృవీకరించుకోవచ్చు.
SMS ద్వారా ఓటరు వివరాలు తెలుసుకోవడం ఎలా..?
మీ వద్ద ఉన్న మొబైల్ ఫోన్ మెసేజ్ యాప్‌ను ఓపెన్ చేసి, చాలా సులభమైన పద్ధతిలో ఎన్నికల సంఘం సూచించిన సమాచారాన్ని పంపాల్సి ఉంటుంది.
- గ్రహీత నంబర్ (Send To) : 1950 (మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఇప్పటికే ఈ నంబర్ ఉంటే దాన్నే ఎంచుకోవచ్చు).
- మెసేజ్ ఫార్మాట్ (SMS Format) : ECI <స్పేస్> మీ EPIC నంబర్
- ఉదాహరణకు : మీ ఓటరు కార్డ్ నంబర్ UTQ0777245 అనుకుంటే, మీరు టైప్ చేయాల్సిన విధానం : ECI UTQ0777245
- ముందుగా ఇంగ్లీష్ పెద్ద అక్షరాల్లో ECI అని టైప్ చేయాలి. ఆ తర్వాత తప్పనిసరిగా ఒక స్పేస్ (ఖాళీ) ఇవ్వాలి. అనంతరం మీ ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న EPIC నంబర్‌ను స్పష్టంగా టైప్ చేసి 1950 నంబర్‌కు మెసేజ్ పంపాలి.
SMS పంపిన తర్వాత ఏం జరుగుతుంది…?
మీరు మెసేజ్ పంపిన కొద్దిసేపట్లోనే భారత ఎన్నికల కమిషన్ సర్వర్ నుంచి మీ మొబైల్‌కు ఒక రిప్లై సందేశం వస్తుంది. అందులో మీ ఓటరు పేరు, EPIC నంబర్, నియోజకవర్గం లేదా సంబంధిత సమాచారం ప్రత్యక్షమైతే, మీ వివరాలు SIR ప్రక్రియలో విజయవంతంగా నమోదైనట్లేనని అవగాహన చేసుకోవచ్చు.
ఒకవేళ మీకు ఎటువంటి సమాధానం రాకపోయినా, లేదా వివరాలు లభించలేదని మెసేజ్ వచ్చినా కంగారు పడాల్సిన అవసరం లేదు. కేవలం SMS రాకపోవడం వల్ల మాత్రమే మీ పేరు తొలగించబడలేదని గ్రహించాలి. సరైన సమాచారం రానప్పుడు వెంటనే మీ పరిధిలోని బిఎల్ఓ (BLO - బూత్ లెవల్ ఆఫీసర్)ని నేరుగా కలసి వివరాలను సరిచూసుకోవడం శ్రేయస్కరం.
EPIC నంబర్ అంటే ఏమిటి..?
EPIC (Electors Photo Identity Card) నంబర్ అనేది ప్రతి పౌరుడి ఓటరు గుర్తింపు కార్డుపై ముద్రించి ఉండే ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య. ఇది ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు UTQ0777245 లేదా ABC1234567 వంటి ఆంగ్ల అక్షరాలు, అంకెల కలయికతో ఈ నంబర్ ఉంటుంది.
- సందేశం టైప్ చేసేటప్పుడు ECI, EPIC నంబర్‌కు మధ్య ఖాళీ ఇవ్వడం మర్చిపోకూడదు.
- EPIC నంబర్‌లోని ఆంగ్ల అక్షరాలు, సంఖ్యలను ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా టైప్ చేయాలి.
- కొన్నిసార్లు నెట్‌వర్క్ రద్దీ లేదా సాంకేతిక సమస్యల వల్ల రిప్లై మెసేజ్ రావడం కొద్దిగా ఆలస్యం కావచ్చు, కాబట్టి ఓపికతో నిరీక్షించాలి.
- ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే మీ ప్రాంతీయ బిఎల్ఓ లేదా స్థానిక ఎన్నికల అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత ప్రాధాన్యమైనది. పోలింగ్ రోజున ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు, ప్రతి ఒక్క ఓటరు ముందుగానే తమ SIR నమోదు స్థితిని ఈ చిన్న SMS విధానం ద్వారా తనిఖీ చేసుకోవడం ఎంతో ఉత్తమం.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

