రేషన్ కార్డుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ నిబంధనలు అత్యంత కీలకమైనవి. వాటిని కచ్చితంగా ఫాలో కావాలి. కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, ఆడపిల్లలకు వివాహమై అత్తవారింటికి వెళ్లినా పాత రేషన్ కార్డు నుంచి వారి పేర్లను తొలగించడం తప్పనిసరి. అంతేకాదు కొందరు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కలిసి కొత్త రేషన్ కార్డు కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటివారు రేషన్ కార్డు నుంచి పేరును తొలగించుకోవాలి.

సమయానికి పేర్లను డిలీట్ చేయకపోతే కొత్త కార్డు దరఖాస్తు చేసుకోవడం లేదా ఇతరుల కార్డులో పేరు చేర్చడం సాధ్యపడదు. అంతేకాదు ఇప్పుడు రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారు ఈ-కేవైసీ పూర్తి చేయాలి. చనిపోయిన వారి పేరును కచ్చితంగా తీసేయాలి. తర్వాత టెక్నికల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
రేషన్ కార్డు నుంచి పేరును ఎలా తొలగించాలో దానికి కావలసిన పత్రాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి. నిజానికి మీ సేవ ద్వారా పేరను తొలగించుకోవచ్చు. కానీ ప్రస్తుతం నేరుగా మండల కేంద్రాల వద్దే తొలగించుకోవాల్సి ఉంది. ఈ విషయంపై HT Telugu ప్రతినిధి హైదరాబాద్ ఉప్పల్ దగ్గరలోని ఒక మీ సేవ కేంద్రానికి వెళ్లారు. ప్రస్తుతానికి ఎమ్మార్వో ఆఫీసులోనే పేరును తొలగించుకోవాలని మీ సేవ వారు తెలిపారు.
పేరు తొలగించడానికి గల కారణాన్ని బట్టి తగిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒరిజినల్ రేషన్ కార్డు(లేదా రేషన్ కార్డు నంబర్), అభ్యర్థి ఆధార్ కార్డు నకలు, చనిపోయిన వారి పేరు తీసివేయాలంటే మున్సిపాలిటీ లేదా పంచాయతీ జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం కావాలి. పెళ్లి అయిన వారి పేరు తీసివేయాలంటే వివాహ ధ్రువీకరణ పత్రం కావాలి. కుటుంబ పెద్ద మార్పు కోసం.. ఒకవేళ కార్డు యజమాని చనిపోతే, వారి పేరు తొలగించి వేరే వారిని హెడ్‌గా మార్చే ఫారమ్ కూడా పూర్తి చేయాలి.
పైన చెప్పిన పత్రాలతో మీరు మండల కేంద్రానికి వెళ్లి.. ఎమ్మార్వో ఆఫీసులో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. నేరుగా మీరు మండల ఆఫీసుకు వెళ్లి సంబంధిత పత్రాలు ఇస్తే.. ఈజీగా రేషన్ కార్డు నుంచి పేరును తొలగించవచ్చు.
{{/usCountry}}పైన చెప్పిన పత్రాలతో మీరు మండల కేంద్రానికి వెళ్లి.. ఎమ్మార్వో ఆఫీసులో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. నేరుగా మీరు మండల ఆఫీసుకు వెళ్లి సంబంధిత పత్రాలు ఇస్తే.. ఈజీగా రేషన్ కార్డు నుంచి పేరును తొలగించవచ్చు.
{{/usCountry}}ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కానీ మీ సేవ ద్వారా రేషన్ కార్డు నుంచి పేరును ఎలా తొలగించాలో చూడండి. సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సందర్శించి "Ration Card Member Deletion Form" తీసుకోండి. ఫారమ్‌లో రేషన్ కార్డు నంబర్, డిలీట్ చేయాలనుకుంటున్న వ్యక్తి పేరు, పేరు తీసివేయడానికి గల సరైన కారణాన్ని (మరణం/వివాహం/ఇతర) స్పష్టంగా రాయండి.
సంబంధిత మరణ ధ్రువీకరణ పత్రం లేదా పెళ్లి పత్రికను ఆధార్ కార్డ్‌తో కలిపి ఫారమ్‌కు జతచేయండి. ఫారమ్‌ను మీసేవ ప్రతినిధికి అందజేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు ఇచ్చే ఆకనాలెడ్జ్‌మెంట్ రసీదును భద్రపరుచుకోండి.
దరఖాస్తు సమర్పించిన తర్వాత వివరాలు సంబంధిత సివిల్ సప్లైస్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) / తహశీల్దార్ (MRO) లాగిన్‌కు వెళ్తాయి. ఆయా అధికారులు పత్రాలను పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాత రేషన్ కార్డు డేటాబేస్ నుండి ఆ పేరు శాశ్వతంగా తొలగిస్తారు.