Ration Card Name Delete : రేషన్ కార్డు నుంచి పేరును ఎలా డిలీట్ చేయాలి?

Ration Card Name Delete : రేషన్ కార్డుల నుంచి పేరు తీసేయడానికి కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. చనిపోయిన వ్యక్తి పేరును రేషన్ కార్డు నుంచి డిలీట్ చేయడం మంచిది. లేదంటే ఆ తర్వాత వచ్చే టెక్నికల్ సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతాయి.

Updated on: Aug 2, 2026, 19:11:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రేషన్ కార్డుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ నిబంధనలు అత్యంత కీలకమైనవి. వాటిని కచ్చితంగా ఫాలో కావాలి. కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, ఆడపిల్లలకు వివాహమై అత్తవారింటికి వెళ్లినా పాత రేషన్ కార్డు నుంచి వారి పేర్లను తొలగించడం తప్పనిసరి. అంతేకాదు కొందరు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కలిసి కొత్త రేషన్ కార్డు కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటివారు రేషన్ కార్డు నుంచి పేరును తొలగించుకోవాలి.

రేషన్ కార్డులో పేరు ఎలా తొలగించాలి?
రేషన్ కార్డులో పేరు ఎలా తొలగించాలి?

సమయానికి పేర్లను డిలీట్ చేయకపోతే కొత్త కార్డు దరఖాస్తు చేసుకోవడం లేదా ఇతరుల కార్డులో పేరు చేర్చడం సాధ్యపడదు. అంతేకాదు ఇప్పుడు రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారు ఈ-కేవైసీ పూర్తి చేయాలి. చనిపోయిన వారి పేరును కచ్చితంగా తీసేయాలి. తర్వాత టెక్నికల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

రేషన్ కార్డు నుంచి పేరును ఎలా తొలగించాలో దానికి కావలసిన పత్రాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి. నిజానికి మీ సేవ ద్వారా పేరను తొలగించుకోవచ్చు. కానీ ప్రస్తుతం నేరుగా మండల కేంద్రాల వద్దే తొలగించుకోవాల్సి ఉంది. ఈ విషయంపై HT Telugu ప్రతినిధి హైదరాబాద్ ఉప్పల్ దగ్గరలోని ఒక మీ సేవ కేంద్రానికి వెళ్లారు. ప్రస్తుతానికి ఎమ్మార్వో ఆఫీసులోనే పేరును తొలగించుకోవాలని మీ సేవ వారు తెలిపారు.

పేరు తొలగించడానికి గల కారణాన్ని బట్టి తగిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒరిజినల్ రేషన్ కార్డు(లేదా రేషన్ కార్డు నంబర్), అభ్యర్థి ఆధార్ కార్డు నకలు, చనిపోయిన వారి పేరు తీసివేయాలంటే మున్సిపాలిటీ లేదా పంచాయతీ జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం కావాలి. పెళ్లి అయిన వారి పేరు తీసివేయాలంటే వివాహ ధ్రువీకరణ పత్రం కావాలి. కుటుంబ పెద్ద మార్పు కోసం.. ఒకవేళ కార్డు యజమాని చనిపోతే, వారి పేరు తొలగించి వేరే వారిని హెడ్‌గా మార్చే ఫారమ్ కూడా పూర్తి చేయాలి.

పైన చెప్పిన పత్రాలతో మీరు మండల కేంద్రానికి వెళ్లి.. ఎమ్మార్వో ఆఫీసులో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. నేరుగా మీరు మండల ఆఫీసుకు వెళ్లి సంబంధిత పత్రాలు ఇస్తే.. ఈజీగా రేషన్ కార్డు నుంచి పేరును తొలగించవచ్చు.

ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కానీ మీ సేవ ద్వారా రేషన్ కార్డు నుంచి పేరును ఎలా తొలగించాలో చూడండి. సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సందర్శించి "Ration Card Member Deletion Form" తీసుకోండి. ఫారమ్‌లో రేషన్ కార్డు నంబర్, డిలీట్ చేయాలనుకుంటున్న వ్యక్తి పేరు, పేరు తీసివేయడానికి గల సరైన కారణాన్ని (మరణం/వివాహం/ఇతర) స్పష్టంగా రాయండి.

సంబంధిత మరణ ధ్రువీకరణ పత్రం లేదా పెళ్లి పత్రికను ఆధార్ కార్డ్‌తో కలిపి ఫారమ్‌కు జతచేయండి. ఫారమ్‌ను మీసేవ ప్రతినిధికి అందజేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు ఇచ్చే ఆకనాలెడ్జ్‌మెంట్ రసీదును భద్రపరుచుకోండి.

దరఖాస్తు సమర్పించిన తర్వాత వివరాలు సంబంధిత సివిల్ సప్లైస్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) / తహశీల్దార్ (MRO) లాగిన్‌కు వెళ్తాయి. ఆయా అధికారులు పత్రాలను పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాత రేషన్ కార్డు డేటాబేస్ నుండి ఆ పేరు శాశ్వతంగా తొలగిస్తారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More