Telangana Cheyutha Pension Application Form : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో చేపట్టిన 'చేయూత' పింఛన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. అర్హులైన పేదలకు సకాలంలో పింఛన్లు అందించేందుకు వీలుగా అధికారులు కసరత్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు.

అర్హులైన లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, దరఖాస్తు ప్రక్రియ సులభంగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. చేయూత అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారమ్‌లను అందుబాటులో ఉంచారు. ప్రజలు నేరుగా ఇంటర్నెట్ ద్వారా వీటిని సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
చేయూత అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ ఇలా….
- ముందుగా చేయూత అధికారిక వెబ్‌సైట్ https://www.cheyutha.telangana.gov.in/ ని సందర్శించాలి.
- హోమ్ పేజీలో కనిపిస్తున్న 'చేయూత అప్లికేషన్ ఫారమ్స్' (Cheyutha Application Forms) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడ ఇంగ్లీష్, తెలుగు భాషల్లో వేర్వేరుగా దరఖాస్తు ఫారమ్‌లు కనిపిస్తాయి. మీకు కావాలసిన లింక్‌పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్‌పై అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత, పైన ఉండే 'డౌన్‌లోడ్' ఆప్షన్ ద్వారా ఫారమ్‌ను సేవ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
దరఖాస్తు ఎక్కడ ఇవ్వాలి..?
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అభ్యర్థులు తమ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు సంబంధిత బిల్ కలెక్టర్లకు ఈ పూరించిన దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తుల పరిశీలన ఇలా....
అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులను ఐటీ శాఖకు చెందిన '360 డిగ్రీ సమగ్ర వేదిక' డేటాబేస్ ద్వారా ప్రాథమికంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి విచారణ కోసం దరఖాస్తులను ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ/ఎంఎంసీ/సీఎంసీ డిప్యూటీ కమిషనర్ లేదా తహసీల్దార్లకు పంపుతారు.
వెరిఫికేషన్ ఆఫీసర్ నేరుగా లబ్ధిదారుని వద్దకు వచ్చి… చేయూత సామాజిక భద్రతా పింఛన్ నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్నాయో లేదో నిర్ధారిస్తారు. అర్హులైన అభ్యర్థుల జాబితాను ఆన్లైన్లో నమోదు చేసి, డీఆర్డీఓ (DRDO) మరియు హైదరాబాద్‌లోని డీఆర్ఓ (DRO) ఆఫీసుకు పంపిస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్ తుది ఆమోదం తెలిపిన వెంటనే పింఛన్లను మంజూరు చేసి, ప్రతి నెలా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.
మీ వద్ద ఉండాల్సిన పత్రాలు :
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారం (తప్పనిసరి)
- ఆధార్ కార్డు (తప్పనిసరి)
- వయో నిర్ధారణ పత్రం - జనన ధృవీకరణ / పాఠశాల ధృవీకరణ / ఓటర్ కార్డు (తప్పనిసరి)
- రేషన్ కార్డు లేదా రెవెన్యూ శాఖ వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం (తప్పనిసరి)
- బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ - దివ్యాంగ మైనర్ పిల్లల విషయంలో జాయింట్ ఖాతా (తప్పనిసరి)
- భర్త మరణ ధృవీకరణ పత్రం, భర్త ఆధార్ కార్డు (వితంతు పింఛన్ దరఖాస్తుదారులకు)
- విడాకులు/విడిపోయిన పత్రం లేదా తహసీల్దార్ విచారణ నివేదిక (ఒంటరి మహిళ పింఛన్ దరఖాస్తుదారులకు)
- చేనేత - జౌళి శాఖ ధృవీకరణ పత్రం (చేనేత కార్మికుల విషయంలో)
- ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రం (కల్లు గీత కార్మికుల విషయంలో)