Telangana TET Syllabus 2026 : తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూన్ సెషన్ - 2026 నోటిఫికేషన్ విడుదల కావటంతో దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు.

మరోవైపు అభ్యర్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
కేవలం చదవడమే కాకుండా.. సిలబస్‌పై స్పష్టమైన అవగాహన పెంచుకోవడం విజేతగా నిలవడానికి చాలా ముఖ్యం. అభ్యర్థులు ఎటువంటి గందరగోళానికి గురికాకుండా అధికారిక వెబ్‌సైట్ నుంచే సిలబస్‌ను పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.
టీజీ టెట్ 2026 సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
- టీజీ టెట్ అభ్యర్థులు https://tgtet.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఇక్కడ హోం పేజీలో కనిపించే సిలబస్ ఆప్షన్ పై నొక్కాలి.
- 15 పేపర్ల పేర్లు కనిపిస్తాయి. ఆ పక్కనే సిలబస్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దానిపై నొక్కితే సిలబస్ కాపీ డౌన్లోడ్ అవుతుంది.
- ప్రింట్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
తెలంగాణ టెట్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్-1, ఆరు నుండి ఎనిమిదవ తరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్-2 రాయాల్సి ఉంటుంది. రెండు పేపర్లలోనూ 150 మార్కులకు గానూ 150 ప్రశ్నలు ఇస్తారు. సమయం రెండున్నర గంటలు ఉంటుంది.
అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీ వరకు తెలంగాణ టెట్ కు అప్లయ్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పరీక్షలు జూన్ 15 నుంచి ప్రారంభమవుతాయి. జూన్ 30, 2026 వరకు వివిధ విడతల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థుల సంఖ్య, విడతలను బట్టి పరీక్షా కేంద్రాలను కేటాయించనున్నారు. ఈ ఏడాది టీజీ టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు.
తెలంగాణ టెట్ 2026 నోటిఫికేషన్ - ముఖ్యమైన వివరాలు:
- దరఖాస్తుల ప్రారంభం: ఏప్రిల్ 15, 2026
- దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2026
- హాల్ టికెట్ల డౌన్‌లోడ్: జూన్ 9, 2026 నుంచి అందుబాటులోకి వస్తాయి.
- పరీక్ష తేదీలు - జూన్ 15, 2026 నుంచి జూన్ 30, 2026 మధ్య జరుగుతాయి.
- టెట్ ఫలితాల వెల్లడి: జూలై 28 నుంచి 31 మధ్య ప్రకటించే అవకాశం ఉంది.