SIR Telangana : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR - Special Intensive Revision) ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, ప్రతి ఓటరు తమ వివరాలను పాత రికార్డులతో సరిచూసుకోవడం ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా 2002 నాటి ఓటర్ల జాబితాలో (SIR-2002) మీ తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతయ్యల వివరాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రజల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) కార్యాలయం ఒక సులభమైన ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

భారత ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేసే తెలంగాణ సీఈఓ కార్యాలయం, పాత రికార్డులను శోధించే ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసింది. దీంతో ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా ఇంట్లోనే కూర్చొని కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ ద్వారా నిమిషాల్లో వివరాలను పొందొచ్చు.
ఎస్ఐఆర్ - 2002 రికార్డులను తెలుసుకోవడానికి అభ్యర్థులు ముందుగా తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అధికారిక వెబ్‌సైట్ ( https://ceotelangana.nic.in ) ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలోనే ఓటర్ల వివరాల శోధనకు సంబంధించిన ప్రత్యేక లింక్ డిస్ ప్లే అవుతుంది.
వెబ్‌సైట్‌లో ఓటర్ల పాత వివరాలను శోధించడానికి అధికారులు రెండు రకాల ఆప్షన్లను కల్పించారు. అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి కింది వాటిలో ఏదో ఒక పద్ధతిని ఎంచుకోవచ్చు.
పేరు ఆధారంగా (Search by Name):
మీ వద్ద ఓటరు గుర్తింపు కార్డు నంబరు లేనప్పుడు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.
- మొదటగా వెబ్‌సైట్‌లోని 'సెర్చ్ బై నేమ్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత మీ తల్లిదండ్రులు లేదా తాతల జిల్లాను (Select District) జాబితా నుంచి ఎంపిక చేసుకోవాలి.
- అనంతరం సంబంధిత వ్యక్తి పూర్తి పేరును (Enter Full Name) అక్కడ ఉన్న బాక్సులో నమోదు చేయాలి.
- స్క్రీన్‌పై కనిపించే సెక్యూరిటీ కోడ్‌ను (Captcha) తప్పులు లేకుండా టైప్ చేయాలి.
- చివరగా కింద ఉన్న 'సెర్చ్' బటన్‌పై క్లిక్ చేయాలి.
ఎపిక్ నంబర్ ఆధారంగా (Search by EPIC Number):
ఓటరు గుర్తింపు కార్డు నంబరు అందుబాటులో ఉంటే ఈ పద్ధతి ద్వారా చాలా వేగంగా ఖచ్చితమైన వివరాలను పొందవచ్చు.
- వెబ్‌సైట్‌లో 'సెర్చ్ బై ఎపిక్ నంబర్' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
- మీ తల్లిదండ్రులు లేదా తాతల ఓటరు కార్డుపై ఉన్న ఎపిక్ నంబరును (Enter EPIC Number) అక్కడ టైప్ చేయాలి.
- ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ను నింపాలి.
- చివరగా 'సెర్చ్' బటన్‌ను నొక్కాలి.
ఓటరు గుర్తింపు కార్డు నంబరు అందుబాటులో ఉంటే ఈ పద్ధతి ద్వారా చాలా వేగంగా ఖచ్చితమైన వివరాలను పొందవచ్చు.
- వెబ్‌సైట్‌లో 'సెర్చ్ బై ఎపిక్ నంబర్' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
- మీ తల్లిదండ్రులు లేదా తాతల ఓటరు కార్డుపై ఉన్న ఎపిక్ నంబరును (Enter EPIC Number) అక్కడ టైప్ చేయాలి.
- ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ను నింపాలి.
- చివరగా 'సెర్చ్' బటన్‌ను నొక్కాలి.
మీరు సెర్చ్ బటన్ నొక్కగానే SIR - 2002 డేటాబేస్ నుంచి వెతికి, పూర్తి వివరాలను సిస్టమ్ స్క్రీన్‌పై చూపిస్తుంది. అందులో ఓటరు పేరు , కుటుంబ సభ్యుడితో ఉన్న సంబంధం, ఎస్ఐఆర్-2002 జాబితాలో పేరు ఉందో లేదో తెలిపే స్టేటస్ తో పాటు వారి ఓటరు కార్డు నంబరు స్పష్టంగా కనిపిస్తాయి.