మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు కీలకమైన సారక్క వచ్చే వేళ… మేడారమంతా కూడా భక్తజనసంద్రంగా మారిపోయింది. దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

బుధవారం సాయంత్రం గిరిజన పూజారులు…. సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను మేడారానికి తీసుకువచ్చారు. బుధవారం అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకున్నారు. మహాజాతరలో తొలి ఘట్టం ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు వన దేవతలను తెచ్చారు. వన దేవతలు వచ్చే సమయంలో శివసత్తులు అడుగడుగునా పూనకాలతో ఊగిపోయారు. మూడు అంచెల భద్రత నడుమ వన దేవతలను గద్దెల మీదకు తీసుకొచ్చారు. గద్దెలపై కొలువుదీరిన వన దేవతలను భక్తులు దర్శించకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
నేడు సాయంత్రం(జనవరి 29) సమ్మక్కను చిలకలగుట్టను నుంచి తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. ఈ సమయం మేడారంలో భక్తులు ఊగిపోతుంటారు.
మరోవైపు సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతర సందర్భంగా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మేడారంలో తక్కువ సమయంలో దర్శనం జరుగుతోందని చెబుతున్నారు. భారీ రద్దీ ఉన్నప్పటికీ ఎక్కడా తొక్కిసలాటలు జరగకుండా, క్యూ లైన్లో ఇబ్బందులు లేకుండా దర్శనం సాఫీగా సాగుతోందని భక్తులు పేర్కొంటున్నారు.
మరోవైపు ఈ మేడారం జాతర కోసం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ 4,000 బస్సులను నడుపుతోంది. మెుత్తం 51 వేల ట్రిప్పులను ప్లాన్ చేసింది. ఈ మహా జాతర కోసం 5,000 మందికి పైగా ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ అంబులెన్స్‌లు, 40 బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు.
{{/usCountry}}మరోవైపు ఈ మేడారం జాతర కోసం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ 4,000 బస్సులను నడుపుతోంది. మెుత్తం 51 వేల ట్రిప్పులను ప్లాన్ చేసింది. ఈ మహా జాతర కోసం 5,000 మందికి పైగా ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ అంబులెన్స్‌లు, 40 బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు.
{{/usCountry}}డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సౌలభ్యం కోసం అధికారిక వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్, వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వం యాప్‌లో భద్రతా మాడ్యూల్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో అత్యవసర పరిస్థితుల్లో SOS హెచ్చరికను పంపడం, ఫిర్యాదులను నమోదు చేయడం వంటివి ఉన్నాయి. అంతేకాదు చిన్నపిల్లలు తప్పిపోకుండా రిస్ట్‌బ్యాండ్‌లను ఈసారి ప్రవేశపెట్టారు. దీని ద్వారా పిల్లలు తప్పిపోతే ఈజీగా తల్లిదండ్రులకు వద్దకు చేరుకుంటారు.
ఈ పండుగలో ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడానికి, పర్యావరణ అనుకూల చర్యలను అనుసరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. జంపన్నవాగు వద్ద స్నానాల కోసం ఏర్పాట్లు చేసింది. జంపన్నవాగులో సరిపడా నీరు ప్రవహిస్తోంది.