...
...
Next Story

TG EAPCET 2026 : టీజీ ఎప్‌సెట్‌కు 2 లక్షలకు పైగా దరఖాస్తులు - ఈసారి కూడా భారీగానే..!

TG EAPCET Applications 2026 : టీజీ ఈఏపీసెట్ కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటికే 2 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. ఏప్రిల్‌ 4వ తేదీ వరకు గడువు ఉండగా… మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.

Published on: Mar 25, 2026 09:52 AM IST
Advertisement

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. అయితే ఈసారి కూడా భారీగానే దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.

2 లక్షలు దాటిన దరఖాస్తులు…

టీజీ ఈఏపీసెట్ 2026 (istock image)
టీజీ ఈఏపీసెట్ 2026 (istock image)

ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026 -2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.ఫైన్ తో అయితే… మే 2 వరకు అవకాశం కల్పించారు. ఇక ఇప్పటికే టీజీ ఈఏపీసెట్ - 2026కు రెండు లక్షలకుపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇందులోనూ అత్యధికంగా ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష కోసం 1.50 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. బైపీసీ స్ట్రీమ్ పరీక్షకు 60 వేలు దాటాయి. ఏప్రిల్ 4వ తేదీ(ఫైన్ లేకుండా) నాటికి మరో లక్ష వరకు దరఖాస్తులు రావొచ్చని అధికారులు వేస్తున్నారు. ఫైన్ తో కూడా మే నాటికి గడువు ఉండటంతో… ఈ సమయంలో కూడా దరఖాస్తులు వస్తాయి. అంటే ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగానే ఉంటుందని అంచనా.

ఇప్పటికే పలు జిల్లాల్లో పరీక్షా జోన్‌లను ఎంచుకునే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అధికారులు వాటిని బ్లాక్ చేశారు. మహబూబ్‌నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో పరీక్షా జోన్లను స్తంభింపజేసింది. ఈ జిల్లాల నుండి అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయి. పరీక్షా కేంద్రాల సామర్థ్యానికి మించి ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 టెస్ట్ జోన్లు ఉండగా…. 10 జోన్లు ఇప్పటికే నిండిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్(జోన్​ 1, 2, 3), ఖమ్మం, సత్తుపల్లి, వరంగల్ కేంద్రాల్లోనే స్లాట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

పరీక్ష తేదీలు:

టీజీ ఈఏపీసెట్ - 2026 పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి… అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం ర్యాంకులను వెల్లడించారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు.

టీజీ ఈఏపీసెట్ 2026 - ముఖ్యమైన తేదీలు

  • టీజీ EAPCET దరఖాస్తులకు చివరి తేదీ - 4 ఏప్రిల్ 2026.
  • రూ. 250 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 10-04-2026.
  • రూ. 500 ఫైన్ తో చివరి తేదీ - 15-04-2026.
  • రూ. 2,500 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 20-04-2026.
  • రూ. 5,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - 24-04-2026.
  • రూ. 10,000 ఆలస్య రుసుంతో చివరి తేదీ - : 02-05-2026.
  • అధికారిక వెబ్ సైట్ - https://eapcet.tgche.ac.in/

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe