TG Gurukul CET 2026 : గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ - హాల్ టికెట్లు విడుదల, ఈ లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. తాాజాగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. గురుకుల అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
గురుకులాల్లో ప్రవేశాలు
ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం కింద ఐదో తరగతిలో ప్రవేశాలు (TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREIS) కల్పిస్తారు. ప్రస్తుతం నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసేందుకు అర్హులవుతారు.
హోం పేజీలోని డౌన్లోడ్ హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయాలి.
అభ్యర్థి రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయవచ్చు.
అభ్యర్థి పేరు లేదా మొబైల్ నెంబర్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
ఈనెల 22న ఎగ్జామ్…
గురుకుల ప్రవేశ పరీక్షను ఈనెల 22వ తేదీన నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది. అన్ని జిల్లాల్లోని నిర్ణీత పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది.
గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. సమయం 2 గంటలు ఉంటుంది. 5 విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు. తెలుగు నుంచి 20, ఇంగ్లీష్ - 25, మ్యాథ్స్ 25, ఈవీఎస్ - 20, మెంటల్ ఏబిలిటీ నుంచి 10 ప్రశ్నలుంటాయి.
ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో సాధించే మార్కుల ఆధారంగా ర్యాంకులు ఉంటాయి. వీటి ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి… సీట్ల భర్తీని పూర్తి చేస్తారు. గత కొంత కాలంగా రాష్ట్రంలో గురుకుల అడ్మిషన్లకు తెగ డిమాండ్ ఉంటోంది.