మేడారం జాతరలో మహాఘట్టం - వనంలో నుంచి జనంలోకి సమ్మక్క..!

మేడారం సమ్మక్క - సారక్క జాతర వైభవంగా సాగుతోంది. సాయంత్రం తర్వాత చిలకలగుట్ట నుంచి సమ్మక్క మేడారానికి చేరుకుంది. సమ్మక్క గద్దెకు వచ్చే ముందు పోలీసులు… ఎ.కె 47తో గాలిలో కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలికారు.

Published on: Jan 29, 2026, 20:13:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మేడారం జాతర వైభవంగా కొనసాగుతోంది. ఇప్పటికే సారలమ్మ గద్దెపైకి రాగా… గురువారం సమ్మక్క కొలువుదీరింది. సమ్మక్క అమ్మవారు గద్దెకు చేరుకుంటున్న వేళ…. భక్తులు భారీగా తరలివచ్చరు.

మేడారం జాతరలో మహాఘట్టం - వనంలో నుంచి జనంలోకి సమ్మక్క..!
మేడారం జాతరలో మహాఘట్టం - వనంలో నుంచి జనంలోకి సమ్మక్క..!

చిలకలగట్టు కంకవనం నుంచి జనంలోకి సమ్మక్క తల్లి ఆగమనం చేసింది. శుభసుచకంగా జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. కుంకుమ భరణి సమ్మక్క ప్రతి రూపాన్ని పూజారులు గద్దెలపైకి తీసుకుని వచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, , జిల్లా కలెక్టర్ దివాకర్ స్వాగతం పలికారు.

ఇప్పటికే గద్దెలపై సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు కొలువుదీరారు. వన దేవతలు రాక వేళ శివసత్తులు అడుగడుగునా పూనకాలతో ఊగిపోయారు. మూడు అంచెల భద్రత నడుమ వన దేవతలను గద్దెల మీదకు తీసుకొచ్చారు. గద్దెలపై కొలువుదీరిన వన దేవతలను భక్తులు దర్శించకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

సమ్మక్క రాక సమయంలో భక్తులు తాకేందుకు ప్రయత్నించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

మహా జాతరలో సమ్మక రాక వేళ డోలు వాయిద్యాలు, ఎదురుకోళ్లతో భక్తులు అత్యంత ఘనంగా స్వాగతం పలికారు.ఈ నెల 31 వరకు మేడారం జాతర కొనసాగనుంది. భక్తుల రద్దీ రోజురోజుకూ మరింత పెరగుతోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More