రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. రూ.39 లక్షలు.. ఇక్కడ వేలం పాటకు 45 ఏళ్ల చరిత్ర
హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనోత్సవ వేళ అందరూ ఆసక్తిగా ఎదురుచూసే బాలాపూర్ గణేశుడి లడ్డూ (Balapur Ganesh Laddu) వేలం పాట మళ్లీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈసారి వేలంలో లడ్డూ ప్రసాదం ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో రూ.39 లక్షల భారీ ధర పలికింది.
హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణపతి లడ్డూ వేలం (Balapur Ganesh Laddu Auction) ఈసారి సరికొత్త చరిత్ర సృష్టించింది. తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన ఈ వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలో రూ.39 లక్షల ఆల్‌టైమ్ హై ధరకు అమ్ముడుపోయింది. వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్‌కు చెందిన సామ ప్రణీత్‌రెడ్డి ఈ విశిష్టమైన లడ్డూ ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు.

వినాయక నిమజ్జనం రోజున ఎంతో కోలాహలంగా జరిగే ఈ వేలం పాటలో పాల్గొనేందుకు మొత్తం 8 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రారంభం నుంచే తీవ్ర పోటీ నెలకొంది. చివరికి సామ ప్రణీత్‌రెడ్డి రూ.39 లక్షలు పలికి లడ్డూను సొంతం చేసుకున్నారు. లడ్డూను దక్కించుకున్న అనంతరం ప్రణీత్‌రెడ్డి మాట్లాడుతూ.. లంబోదరుడి ఆశీస్సులు తన కుటుంబంతో పాటు సమాజానికీ లభించాలని ఆకాంక్షించారు.
బాలాపూర్ గణేశుడి చేతిలోని 21 కిలోల లడ్డూ ప్రసాదానికి భక్తులలో అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ లడ్డూను పొందితే ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, వ్యాపారవృద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం. దక్కించుకున్న లడ్డూను కుటుంబ సభ్యులు, బంధువులకు పంచి, కొంత భాగాన్ని పొలాల్లో చల్లితే పంటలు సమృద్ధిగా పండుతాయని రైతుల నమ్మకం.
45 ఏళ్ల ఘన చరిత్ర
బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి 45 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. అయితే లడ్డూ వేలం పాట పద్ధతి 1994లో ప్రారంభమైంది. తొలి వేలం (1994) స్థానిక రైతు కొలను మోహన్‌రెడ్డి మొదటిసారిగా కేవలం రూ.450కే లడ్డూను దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన జీవితంలో సాధించిన పురోగతితో ఈ వేలానికి విశేష ప్రజాదరణ లభించింది. మొదటి 15 ఏళ్ల పాటు కేవలం స్థానికులకే పరిమితమైన వేలం పాటను 2009 నుంచి బయటి వ్యక్తులకు కూడా విస్తరించారు. ఆ ఏడాదే సరిత అనే మహిళ రూ.5.10 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.
31 ఏళ్ల వేలం చరిత్రలో ఒక్క 2020లో మాత్రమే కరోనా నిబంధనల వల్ల వేలం నిర్వహించలేదు. అప్పట్లో ఈ లడ్డూను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు.
1994కొలను మోహన్‌రెడ్డి రూ.450. 2009సరిత (బయటి వ్యక్తులకు మొదటిసారి) రూ.5.10 లక్షలు, 2023 లింగాల దశరథ్‌గౌడ్ రూ.35 లక్షలు,2024 కొలను శంకర్‌రెడ్డిరూ.30.01 లక్షలు, ప్రస్తుతం సామ ప్రణీత్‌రెడ్డి రూ.39 లక్షలు (ఆల్‌టైమ్ రికార్డు) ధర పలికింది. గతేడాది రూ.35 లక్షలతో పోలిస్తే ఈసారి ఏకంగా రూ.4 లక్షలు అధికంగా పలకడం విశేషం.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


