హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనోత్సవం.. ట్రాఫిక్ ఆంక్షలు, ఊరేగింపు మార్గాలు!
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాల శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.
వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. శుక్రవారం నాడు భాగ్యనగరంలో గణేష్ విగ్రహాల తుది నిమజ్జనం అత్యంత వైభవంగా జరుగుతోంది. నగర నలుమూలల నుంచి వేలాది విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌తో పాటు సమీపంలోని ఇతర ప్రదేశాలకు వస్తున్నాయి. పోలీసులు భారీ భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. సజావుగా నిమజ్జన ఉత్సవాలు పూర్తి చేసేందుకు వీలుగా పోలీసులు సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్లు విధించారు.

హైదరాబాద్ నిమజ్జనోత్సవంలో బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర అత్యంత కీలకమైనది. ప్రసిద్ధి చెందిన బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసిన అనంతరం ఉదయాన్నే విగ్రహ ఊరేగింపు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది.
ప్రధాన శోభాయాత్ర రూట్: బాలాపూర్ ➔ చంద్రాయణగుట్ట వంతెన ➔ ఫలక్‌నుమా ➔ అలియాబాద్ ➔ చార్మినార్ ➔ మదీనా జంక్షన్ ➔ అఫ్జల్‌గంజ్ ➔ మహారాజాగంజ్ ➔ అబిడ్స్ ➔ బషీర్‌బాగ్ ➔ లిబర్టీ ➔ ఎన్టీఆర్ మార్గ్ & పీవీ నరసింహారావు మార్గ్ (నెక్లెస్ రోడ్డు).
ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ఖైరతాబాద్ రాజ్‌దూత్ చౌరస్తా➔టెలిఫోన్ భవన్➔ఇక్బాల్‌మినార్ చౌరస్తా➔తెలంగాణతల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంటుంది.
సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, తార్నాక, టోలిచౌకి, ఎర్రగడ్డ, ఆసిఫ్‌నగర్, రాంనాథ్‌పూర్ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు నిర్ణీత కనెక్టింగ్ పాయింట్ల వద్ద ప్రధాన ఊరేగింపు శోభాయాత్రలో కలుస్తాయి. ప్రధాన ఊరేగింపు సాగే రహదారుల్లో కేవలం వినాయక విగ్రహాలు వేళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. సాధారణ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
నగరంలో తూర్పు-పడమర దిశల మధ్య ప్రయాణించే సాధారణ వాహనాల కోసం బషీర్‌బాగ్ జంక్షన్ వద్ద మాత్రమే క్రాసింగ్‌కు పోలీసు శాఖ అవకాశం కల్పించింది. సాధారణ నగర ప్రయాణికులు ఇన్నర్ రింగ్ రోడ్డు, మసాబ్ ట్యాంక్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్ లేదా ఔటర్ రింగ్ రోడ్డు వినియోగించాలి.
భారీ వాణిజ్య వాహనాలు, లారీలు నగరంలోకి ప్రవేశం పూర్తిగా నిషిద్ధం. శివార్లలోనే నిలిపివేసి ఓఆర్ఆర్ వైపునకు మళ్లిస్తారు. ప్రైవేట్ డిస్ట్రిక్ట్ బస్సులుసెప్టెంబర్ 26 మధ్యాహ్నం 12 గంటల వరకు బయటి రింగ్ రోడ్ల ద్వారానే నడపాలి. ఎంజీబీఎస్‌కి వెళ్లే ఆర్టీసీ బస్సులు పోలీసు ప్రత్యేక డైవర్షన్ మార్గాల ద్వారా బస్టాండ్‌కు చేరుకోవాలి.
ట్యాంక్ బండ్, ఇతర నిమజ్జన ప్రాంతాలకు వచ్చే భక్తులు తమ సొంత వాహనాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే పార్క్ చేసి నడకదారిన రావాల్సి ఉంటుంది. కేటాయించిన పార్కింగ్ కేంద్రాలు ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ ఆలయం / దిగువ ట్యాంక్ బండ్ రోడ్డు, పబ్లిక్ గార్డెన్, ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలు, పాతబస్తీ ఖిల్వత్ మైదానం.
నిమజ్జనం పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ మార్గ్, ఎగువ ట్యాంక్ బండ్, పీవీ ఎన్ఆర్ మార్గ్ నుంచి బయటకు వెళ్లే ఖాళీ లారీలు/ట్రక్కులు అధికారులు కేటాయించిన ఎగ్జిట్ పాయింట్ల ద్వారా మాత్రమే రిటర్న్ కావాలి. నగరం వ్యాప్తంగా జిహెచ్‌ఎంసీ, హైదరాబాద్ సిటీ పోలీస్ క్రేన్లు, విద్యుత్ దీపాలు, శానిటేషన్ సిబ్బందిని భారీగా రంగంలోకి దింపాయి.
హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరవ్యాప్తంగా భారీ క్రేన్లను నిమజ్జనం కోసం అందుబాటులో ఉంచారు. పర్యావరణ పరిరక్షణ, రద్దీ నియంత్రణ కోసం నగరవ్యాప్తంగా 70కి పైగా బేబీ పాండ్స్‌ను సిద్ధం చేశారు. దాదాపు 25,000 మందికి పైగా పోలీసులతో భద్రత, డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు సమయానికి చేరుకోవడానికి ముందుగానే ప్లాన్ చేసుకుని, సాధ్యమైనంత వరకు హైదరాబాద్ మెట్రో రైలు సేవలను వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


