పుస్తక ప్రియులకు శుభవార్త వచ్చేసింది. ప్రతి ఏడాది నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభ తేదీలను ప్రకటించారు. ఈనెల 19వ తేదీ నుంచి ఈ మెగా బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 29వ తేదీతో ముగియనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు యాకూబ్ వెల్లడించారు.

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో శనివారం మీడియాతో మాట్లాడిన యాకూబ్ సాహితీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం ప్రారంభం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. బుక్ ఫెయిర్ వేళ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని తెలిపారు.
ఎన్నో వైవిద్యభరితమైన జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు బుక్‌ఫెయిర్‌కు వస్తాయి. తెలుగు అకాడమీ, విశాలాంధ్ర, నవతెలంగాణ, నవోదయ, ఎమెస్కో, తెలుగు బుక్స్, సేజ్, పెంగ్విన్, నవయుగ వంటి పుస్తక ప్రచురణ సంస్థలు అన్నీ ఒకే దగ్గర కనిపించనున్నాయి. విలువైన నవలలు, సాహిత్య విశ్లేషణ పుస్తకాలతో బుక్‌ఫెయిర్ కొనసాగనుంది. ప్రతి ఏడాది జరిగే ఈ అతిపెద్ద పుస్తక మహోత్సవం కోసం పుస్తకప్రియులు ఎంతో ఆసక్తికగా ఎదురూచూస్తుంటారు. పుస్తకాలను కూడా భారీగానే విక్రయిస్తుంటారు. ఈసారి కూడా భారీగానే పుస్తకాలు కొనుగోలు కానున్నాయి.
పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు సౌకర్యంగా ఉండేలా…. బుక్ ఫెయిర్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళం, సంస్కృతం, ఉర్దూ, మరాఠీ, కన్నడ భాషాకు సంబంధించిన పుస్తకాలు ఈ బుక్ ఫెయిర్‌లో లభ్యమవుతాయని నిర్వాహకులు తెలిపారు. పిల్లలు, యువత, పెద్దలు ఇలా అందరూ బుక్ ఫెయిర్ను సందర్శించి విజయవంతం చేయాలని కోరారు. పుస్తక ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేయాలనుకునేవారు ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.