...
...
Next Story

సేవ్ వాటర్ వాలంటీర్.. నీటిని వృథా చేస్తే ఫిర్యాదు.. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?

Hyderabad Water Board : మీరు నీటిని వృథా చేస్తున్నారా? అయితే మీపై ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తారు. తప్పు చేస్తే దానికి సంబంధించిన జరిమానా మీ వాటర్ బిల్లులో వస్తుంది.

Published on: Apr 22, 2026, 17:56:24 IST
Advertisement

హైదరాబాద్ పౌరులు ఇకపై నీటి దుర్వినియోగాన్ని నివేదించవచ్చు. జరిమానాలను నేరుగా బిల్లులకు కలిసి వస్తాయి. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి సేవ్ వాటర్ వాలంటీర్ కార్యక్రమం చేపట్టింది. నీటి వృథాను తగ్గించేందుకు.. బాధ్యతాయుత నీటి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు “సేవ్ వాటర్ వాలంటీర్” కార్యక్రమాన్ని ప్రారంభించింది.

కార్యక్రమం ముఖ్యాంశాలు

  • HMWSSB వెబ్‌సైట్ ద్వారా వాలంటీర్ల ఆన్‌లైన్ నమోదు
  • నీటి వృథా సంఘటనలను నివేదించేందుకు మొబైల్ యాప్
  • నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించే అమలు విధానం

నమోదుకు అవసరమైన వివరాలు

  • పేరు
  • చిరునామా
  • మొబైల్ నంబర్
  • ఫోటోగ్రాఫ్

చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ ప్రూఫ్

హైదరాబాద్ వాటర్ బోర్డు
హైదరాబాద్ వాటర్ బోర్డు

సమర్పించిన దరఖాస్తులను HMWSSB పరిశీలించి, అర్హులైన వాలంటీర్లను ఎంపిక చేసి కార్యక్రమంలో చేర్చుతుంది. ధృవీకరించిన వాలంటీర్లకు ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ యాక్సెస్ ఇస్తారు. నీటి వృథా సంఘటనలను ఫోటో ఆధారాలతో అప్లోడ్ చేయవచ్చు. ఫిర్యాదులు ఓటీపీ ద్వారా ధృవీకరిస్తారు ధృవీకరించిన ఫిర్యాదులపై జలమండలి అధికారులు సమీక్ష చేసి అవసరమైన చర్యలు తీసుకుంటారు.

జరిమానాలు, ప్రోత్సాహకాలు

ధృవీకరించిన ఫిర్యాదులు సంబంధిత వినియోగదారుడి CAN కు అనుసంధానం చేసి లెడ్జర్‌లో నమోదు చేస్తారు. తగిన జరిమానాలు విధిస్తారు. సంబంధిత వినియోగదారుడికి సమాచారం పంపిస్తారు. చురుకుగా పాల్గొనే వాలంటీర్లకు ప్రోత్సాహకాలు అందిస్తారు..

HMWSSB అధికారిక వెబ్‌సైట్ (http://hyderabadwater.gov.in⁠) లోని “Quick Links” విభాగంలో “SAVE WATER Volunteer Registration” లింక్ అందుబాటులో ఉంది. ఈ కార్యక్రమంలో పౌరులు చురుకుగా పాల్గొని నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని, నీటి భద్రతతో కూడిన హైదరాబాద్ నిర్మాణానికి తోడ్పడాలని హైదరాబాద్ జలమండలి కోరింది.

నీటి నల్లాలకు మోటార్లను బిగించి అక్రమంగా నీటిని తోడుతున్న వారికి, జరిమానా విధించడానికి, జలమండలి సరఫరా చేస్తున్న నీటిని తాగు నీటికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకమైన ఈ మొబైల్ యాప్ రూపొందించింది.

వాలంటీర్ ఆ ప్రాంతాల్లో ఇల్లీగల్ మోటార్లను బిగించి అక్రమంగా నీటిని తోడుతున్న వారిని, నీటి వృథా చేస్తున్న వినియోగదారులను గుర్తించి ఫోటోతో సహా యాప్‌లో అప్లోడ్ చేయడం.. సదరు కనెక్షన్ గుర్తించి ట్యాగ్ చేయడంతో వెంటనే ఆ కన్స్యూమర్ కనెక్షన్ నెంబర్ మీద జరిమానా వేస్తారు. సదరు వినియోగదారుడి కనెక్షన్ అకౌంట్‌కు పెనాల్టీ జమ అవుతుంది. అలాగే ఈ మొత్తం వచ్చే నెల బిల్‌లో చెల్లించేలాగా రూపొందించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe