హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీపై నగర పోలీసులు ఫోకస్ పెట్టనున్నారు. ఇక ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే విషయంపై నగర పోలీస్ కమిషనర్ సజ్జానర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కల్తీ రక్కసిని కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీసు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించారు.

ఆహార కల్తీని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో బుధవారం ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులతో సీపీ సజ్జనార్ రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. ఆహార కల్తీని తాము చిన్నపాటి నేరంగా చూడటం లేదని, ఇది ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే 'హత్యాయత్నం'గానే పరిగణిస్తామని తేల్చిచెప్పారు. కేవలం రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారులనే కాకుండా, కల్తీకి మూలమైన తయారీ కేంద్రాలపై దాడులు చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా 'స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్'ను రూపొందించి.. అమలు చేస్తామని తెలిపారు.
ఆహార కల్తీ నియంత్రణలో క్షేత్రస్థాయి సవాళ్లు, చేపట్టాల్సిన చర్యలపై పోలీసు, ఆహార భద్రత అధికారులతో సీపీ సజ్జనార్ సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు పలు సూచనలు చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకుని.. కల్తీ నివారణకు ఎస్‌వోపీ రూపొందించి, అమలు చేస్తామని సీపీ స్పష్టం చేశారు. తనిఖీలు, నమూనాల సేకరణ, సీజ్ చేయడం, అరెస్టుల ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తామన్నారు.
వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిందేనని సీపీ స్పష్టం చేశారు. కల్తీ కేసుల్లో పదే పదే పట్టుబడితే వారి వ్యాపార లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజారోగ్యానికి హాని తలపెట్టే కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే సమాచారం అందించేందుకు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి ప్రత్యేక వాట్సాప్ లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ను తీసుకువస్తున్నట్లు సీపీ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
{{/usCountry}}కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే సమాచారం అందించేందుకు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి ప్రత్యేక వాట్సాప్ లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ను తీసుకువస్తున్నట్లు సీపీ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
{{/usCountry}}