అధిక ధరలు తీసుకోవద్దు...! క్యాబ్స్, ఆటోలకు నగర పోలీసుల వార్నింగ్ - ఈ నెంబర్ కు ఫిర్యాదు చేయండి

న్యూ ఇయర్‌ వేడుకల వేళ క్యాబ్‌, ఆటో డ్రైవర్లకు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ హెచ్చరికలు జారీ చేశారు. రైడ్స్ నిరకారించినా, అధిక ఛార్జీలు వసూలు చేసినా ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు. +91 94906 16555 వాట్సాప్ నెంబర్ ద్వారా హైదరాబాద్ పోలీస్ కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

Published on: Dec 31, 2025, 06:54:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూ ఇయర్ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పక్కాగా నిఘా పెట్టే పనిలో పడ్డారు. ఇప్పటికే ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్స్ నిర్వహిస్తుండగా…. తాజాగా క్యాబ్స్, ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. రైడ్స్ నిరకారించినా, అధిక ఛార్జీలు వసూలు చేసినా ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు నగర సీపీ సజ్జనార్ ప్రకటన చేశారు.

హైదరాబాద్ సిటీ పోలీస్
హైదరాబాద్ సిటీ పోలీస్

ఉపేక్షించేది లేదు - సీపీ సజ్జనార్

న్యూ ఇయర్ సందర్బంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా సహించేదే లేదని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించమన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

"మీకు ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే, వెంటనే మాకు తెలియజేయండి. వాహనం నంబర్, సమయం/ప్రదేశం, రైడ్ వివరాల స్క్రీన్‌షాట్ వివరాలను దరాబాద్ పోలీస్ అధికారిక వాట్సాప్ నంబర్ +91 94906 16555 కు పంపించండి" అని సీపీ సజ్జనార్ సూచించారు.

విస్తృత తనిఖీలు…

మరోవైపు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మద్యం మత్తులో వాహనాలను నడిపే వారిని నియంత్రించే దిశగా ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా వారం రోజుల నుంచి నగరంలో ప్రత్యేక 'డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌' సోదాలు కొనసాగుతున్నాయి.

ఏడు ప్లాటూన్ల అదనపు బలగాలతో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని నగర పోలీసులు స్పష్టం చేశారు. తనిఖీల్లో పట్టుబడితే వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. తీవ్రతను బట్టి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామని కూడా చెబుతున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More