కార్పొరేట్ కంపెనీల్లో పని గంటలు, పని దినాలపై సోషల్ మీడియాలో నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక 25 ఏళ్ల మహిళా సివిల్ ఇంజనీర్ రెడ్డిట్ (Reddit) వేదికగా పంచుకున్న పోస్ట్ కార్పొరేట్ వర్గాల్లో సరికొత్త చర్చను లేవనెత్తింది. వారానికి ఆరు రోజుల పని భారం తనను మానసికంగా కుంగదీస్తోందని, దీని నుంచి విముక్తి లభిస్తే తక్కువ జీతానికైనా పనిచేయడానికి సిద్ధమని ఆమె ప్రకటించారు.

సదరు యువతి 2023లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక భారీ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నారు. నిర్మాణ రంగంలో మిగతా ప్రపంచంలా ఐదు రోజుల పని సంస్కృతిని ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ నిరంతర శ్రమ వల్ల కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి పూర్తిగా దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
'మేమేం యంత్రాలం కాదు'
"ఆరు రోజుల పని దినాల వల్ల నేను మానసికంగా తీవ్రంగా అలసిపోయాను. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి కనీసం ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, కుటుంబంతో గడపడానికి కూడా ఓపిక ఉండటం లేదు. ఇక ఆదివారం మొత్తం వారమంతా పడ్డ అలసట నుంచి కోలుకోవడానికే సరిపోతోంది. అది ఎలా గడిచిపోతుందో తెలిసేలోపే మళ్లీ సోమవారం వచ్చేస్తోంది" అని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
కంపెనీల లాభాల కోసం ఉద్యోగులను యంత్రాల్లా వాడుకోవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
"ఎవరిదో సామ్రాజ్యాన్ని విస్తరించడానికి మేమేం యంత్రాలం కాదు, మనుషులం. ఈ దోపిడీ ఎప్పుడు ఆగుతుంది? ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు ఐదు రోజుల పని దినాలను అమలు చేస్తున్నాయి" అని ఆమె వాపోయారు.
రూ. 23 వేల జీతం.. రూపాయి మిగలట్లేదు
దేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకదానిలో పనిచేస్తున్నప్పటికీ, ఆమెకు వస్తున్న జీతం కేవలం రూ. 23,000 మాత్రమే. ఈ ఆరు రోజుల నరకం నుంచి తప్పించుకోవడానికి, కొత్త ఉద్యోగంలో అంతకంటే తక్కువ జీతం ఇచ్చినా చేరడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. ఆమెకు కావల్సిందల్లా వారానికి రెండు రోజుల సెలవు (5-day work week) మాత్రమే.
{{/usCountry}}దేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకదానిలో పనిచేస్తున్నప్పటికీ, ఆమెకు వస్తున్న జీతం కేవలం రూ. 23,000 మాత్రమే. ఈ ఆరు రోజుల నరకం నుంచి తప్పించుకోవడానికి, కొత్త ఉద్యోగంలో అంతకంటే తక్కువ జీతం ఇచ్చినా చేరడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. ఆమెకు కావల్సిందల్లా వారానికి రెండు రోజుల సెలవు (5-day work week) మాత్రమే.
{{/usCountry}}నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తన ఖర్చుల వివరాలను కూడా ఆమె పంచుకున్నారు.
"వచ్చే రూ. 23 వేల జీతంలో పొదుపు చేయడానికి ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు. రూ.8,000 అద్దెకు పోగా, రూ.10,000 ఇంటికి పంపుతాను. మిగిలిన రూ.5,000 ప్రయాణ ఖర్చులు, ఇతర అవసరాలకు సరిపోతున్నాయి" అని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మద్దతు
ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఆ యువతికి మద్దతుగా నిలుస్తున్నారు.
"ఈ దేశం నిన్ను గుర్తించడంలో విఫలమైంది. నీ నైపుణ్యానికి తగిన ఉద్యోగాన్ని వెతుక్కో లేదా విదేశాలకు వెళ్ళిపో" అని ఒకరు కామెంట్ చేశారు.
"రూ.23 వేల జీతానికి వారానికి ఆరు రోజులు పనిచేయించుకోవడం చాలా దారుణం. నీకు మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను" అని మరొకరు రాసుకొచ్చారు.
ఇదే తరుణంలో ఐటీ రంగంలో ఉన్న మరొక ఉద్యోగి స్పందిస్తూ, తాను కూడా ఐటీలో వారానికి ఆరు రోజులు పనిచేస్తూ ఇలాంటి నరకాన్నే అనుభవిస్తున్నానని, త్వరలోనే నైపుణ్యాలు పెంచుకుని ఆ ఉద్యోగం మానేస్తానని తన బాధను పంచుకున్నారు.