Indiramma LIG Flats Hyderabad : ఇందిరమ్మ ఫ్లాట్ల స్కీమ్ అప్డేట్ - లాటరీ తేదీలు ఖరారు!

Indiramma LIG Flats Hyderabad : క్యూర్ పరిధిలోని మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్ల కేటాయింపునకు నవంబరు 3న ఇ-లాటరీ నిర్వహించనున్నారు.ఈ వివరాలను తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ ప్రకటించారు. రద్దయిన ఫ్లాట్లకు నవంబరు 4న మాప్‌ అప్ లాటరీ తీస్తారు.

Published on: Nov 1, 2026, 09:06:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Indiramma LIG Flats Hyderabad : హైదరాబాద్ మహానగరంలో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకుంటున్న నిరుపేదలు, అల్పదాయ వర్గాల ప్రజలకు తెలంగాణ హౌసింగ్ బోర్డు మరో అప్డేట్ అందించింది. కోర్ అర్బన్ పరిధికి చెందిన మరో నాలుగు కీలక నియోజకవర్గాల్లో ఇందిరమ్మ లో-ఇన్‌కమ్ గ్రూప్ (LIG) ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ మేరకు నవంబరు 3వ తేదీన పారదర్శకంగా ఆన్‌లైన్ లాటరీ (ఇ-లాటరీ) నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ వెల్లడించారు.

ఇందిరమ్మ టవర్స్
ఇందిరమ్మ టవర్స్

నియోజకవర్గాలివే…

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముషీరాబాద్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, గోషామహల్ నియోజకవర్గాల్లో నిర్మించిన ఇందిరమ్మ టవర్లలో ఈ ఫ్లాట్లను దరఖాస్తుదారులకు కేటాయిస్తారు. గత కొంతకాలంగా ఈ ఫ్లాట్ల కేటాయింపు కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ప్రజలు నిరీక్షిస్తున్నారు. ప్రజల నిరీక్షణకు తెర దించుతూ పూర్తి పారదర్శక పద్ధతిలో కంప్యూటరీకృత డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

నవంబరు 4న రద్దయిన స్థానాలకు 'మాప్ అప్ లాటరీ'

గతంలో కోర్ అర్బన్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఆయా నియోజకవర్గాల పరిధిలోనే డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఎంపిక ప్రక్రియ తర్వాత అధికారులు చేపట్టిన క్షేత్రస్థాయి క్షుణ్ణమైన పరిశీలనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు దరఖాస్తుదారులు తప్పుడు సమాచారం అందించినట్లు తేలడంతో వారిని అధికారులు అనర్హులుగా ప్రకటించారు. మరికొందరు నిర్ణీత సమయంలో హౌసింగ్ బోర్డుకు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించలేకపోయారు.

ఈ రకమైన వివిధ సాంకేతిక, ఆర్థిక కారణాలతో నియోజకవర్గాల వారీగా గతంలో కేటాయించిన పలు ఫ్లాట్లు రద్దయ్యాయి. ఇలా ఖాళీగా మిగిలిపోయిన ఫ్లాట్లను భర్తీ చేసేందుకు నవంబరు 4న ప్రత్యేకంగా 'మాప్ అప్' (చివరి దశ) లాటరీ నిర్వహించనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని తొలి విడతలో అవకాశం రాని మిగిలిన దరఖాస్తుదారులకు ఈ మాప్ అప్ లాటరీ ద్వారా ఫ్లాట్ లభించే సువర్ణావకాశం దక్కనుంది.

లాటరీ ప్రత్యక్ష ప్రసారం….

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పూర్తి పారదర్శకతను పాటిస్తున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు స్పష్టం చేసింది. రెండు రోజుల పాటు జరిగే లాటరీ ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహిస్తారు. ఈ ఇ-లాటరీ ప్రక్రియ మొత్తాన్ని ప్రజలు, దరఖాస్తుదారులు నేరుగా వీక్షించేందుకు వీలుగా యూట్యూబ్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమింగ్) చేయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ తెలియజేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More