...
...
Next Story

హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్ : కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు - వన్ వే ట్రయల్ రన్, పూర్తి వివరాలు

KBR Park Traffic Diversions : హైదరాబాద్ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలో స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ పనులు జరుగుతున్నాయి. దీంతో ఇవాళ(ఆదివారం) కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ వన్-వే ట్రయల్ రన్, మళ్లింపులు ఉంటాయి.

Published on: Jun 21, 2026 07:54 AM IST
Advertisement

KBR Park Traffic Diversions : హైదరాబాద్ నగరంలో కీలకమైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ముఖ్యమైన అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతిష్టాత్మకమైన స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు
కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు

ఈ నిర్మాణ పనుల కారణంగా….. కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. జూన్ 21, 2026 (ఆదివారం) ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకువన్-వే ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సైన్‌బోర్డుల ఆధారంగా వాహనదారులు ఎడమ, కుడి లేన్‌లలోకి మారడానికి 'లేన్ చేంజర్స్' ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు.

ట్రాఫిక్ మళ్లింపుల వివరాలు:

1. NFCL వైపు నుంచి వెళ్లే వాహనదారులకు:

  • మార్గాలు: SNT, సాగర్ సొసైటీ (ముగ్ధ), KBR పార్క్ ఎంట్రన్స్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెం. 36, రోడ్ నెం. 45, కేబుల్ బ్రిడ్జ్ (దుర్గం చెరువు) వైపు వెళ్లే వాహనాలు.
  • ప్రత్యామ్నాయ మార్గం : ఇబ్బందులను నివారించడానికి వాహనదారులు ఎన్టీఆర్ భవన్ వద్ద ఎడమ మలుపు తీసుకుని.. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైపు వెళ్లాలి. అక్కడ నుండి అగ్రసేన్ ఐలాండ్ మీదుగా ఒమేగా హాస్పిటల్ , భారతీయ విద్యాభవన్ జంక్షన్ చేరుకుని.. రోడ్ నెం. 45, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబుల్ బ్రిడ్జ్ మరియు ఐకియా వైపు వెళ్ళవచ్చు.

2. యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ వైపు నుంచి వెళ్లే వారికి:

3. ITC కోహినూర్, కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి వచ్చే వాహనాలు:

  • మార్గాలు: రోడ్ నెం. 45 జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, వెంకటగిరి, ఎన్టీఆర్ భవన్, పంజాగుట్ట వైపు వెళ్లే వాహనాలు.
  • ప్రత్యామ్నాయ మార్గం: సులువైన ప్రయాణం కోసం వాహనదారులు రోడ్ నెం. 60 మరియు 67 మీదుగా ప్రయాణించి…. రోడ్ నెం. 1 ద్వారా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌కు చేరుకోవాలి. అక్కడి నుండి వెంకటగిరి, ఎన్టీఆర్ భవన్ మరియు పంజాగుట్ట వైపు ప్రయాణించవచ్చు.

ముఖ్య సూచనలు:

  • నిర్దేశిత మార్గాల్లో ఎక్కడా 'U' టర్న్‌లు అనుమతించబడవు. సజావుగా ఎగ్జిట్ అవ్వడానికి రోడ్డుకు ఎడమ వైపున ప్రయాణించాలి.
  • ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండటానికి మార్గంలో ఏర్పాటు చేసిన నిర్దేశిత ఎగ్జిట్ పాయింట్లను గమనించాలి.
  • రద్దీ సమయాల్లో భారీ వాహనాలు ఈ మార్గాల్లో రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.
  • రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం నావిగేషన్ యాప్‌లను ఉపయోగించడం మంచిది. వీలైనంత వరకు ప్రజా రవాణా లేదా కార్ పూలింగ్ కు ప్రాధాన్యత ఇవ్వండి.

ట్రాఫిక్ అప్‌డేట్ల కోసం ఫేస్‌బుక్ పేజీ (http://facebook.com/HYDTP), ఎక్స్/ట్విట్టర్ హ్యాండిల్ (@HYDP) ఖాతాలను ఫాలో అవ్వొచ్చు. ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే…. సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్: 9010203626 ను సంప్రదించవచ్చని పోలీసులు ఓ ప్రకటన ద్వారా సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe