కేబీఆర్ పార్క్ పరిధిలోని చెట్లను నరికివేయకూడదు : సుప్రీం కోర్టు

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై సుప్రీం కోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

Published on: May 18, 2026, 14:31:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌ నగర నడిబొడ్డున కేబీఆర్‌ జాతీయ పార్కు పర్యావరణ పరిరక్షణ పోరాటంలో మరో కీలక మలుపు తిరిగింది. ప్రతిపాదించిన ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం కేబీఆర్ పార్క్‌ వద్ద చెట్లను కొట్టేయడంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. తదుపరి విచారణ జరిగే వరకు అక్కడ ఒక్క చెట్టును కూడా కొట్టేయకూడదంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

పార్కు పరిధిలోని ‘పర్యావరణ సున్నిత ప్రాంతం’ (Eco-Sensitive Zone)లో 25 నుంచి 30 మీటర్ల పరిధిలో ఉన్న చెట్లను నరకడానికి వీల్లేదని కోర్టు పేర్కొంది. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 1,300 చెట్లను నరికేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేక్‌రెడ్డి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

'రాత్రి, పగలు తేడా లేకుండా చెట్లను తొలగిస్తున్నారు. కనీసం ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా లేకుండా పర్యావరణానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు.' అని వివేక్ రెడ్డి వాదించారు.

ఈ ఫ్లైఓవర్‌లో భాగంగా చెట్లను నరికేయకుండా ప్రణాళిక ఏమైనా ఉందా అని కోర్టు ప్రశ్నించింది. అలాంటిదేమీ లేదని న్యాయవాది వివేక్ రెడ్డి కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు... కేంద్ర పర్యావరణ శాఖకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను జులై 27కి వాయిదా వేసింది.

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి అప్పట్లో ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల వందలాది ఏళ్ల నాటి చెట్లు అంతరించిపోతాయని, నగర పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని అటు పర్యావరణ ప్రేమికులు, ఇటు స్థానిక ప్రజలు మొదటి నుంచి సేవ్ కేబీఆర్ పార్క్ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు.

ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కోసం అభివృద్ధి పేరిట ఫ్లైఓవర్లు నిర్మించాలా? లేక నగరానికి ఆక్సిజన్ అందించే పర్యావరణాన్ని కాపాడుకోవాలా? అనే చర్చ ఇప్పుడు మళ్లీ సర్వత్రా వ్యక్తమవుతోంది. చెట్లను వేళ్లతో సహా వేరే ప్రాంతానికి తరలించే సాంకేతికత అందుబాటులో ఉన్నా, అది ఎంతవరకు సఫలమవుతుందనేది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చిన స్టే .. ప్రకృతి ప్రేమికులకు పెద్ద ఊరటనిచ్చిందనే చెప్పాలి. మరి జులై 27న కోర్టు ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More