Lakdikapul One Way : 73 ఏళ్ల వ్యక్తి గీసిన స్కెచ్.. లక్డికాపూల్ వద్ద వన్ వే ట్రాఫిక్ ప్లాన్!
Lakdikapul One Way : హైదరాబాద్ లక్డీకాపూల్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొత్తగా వన్‌వే విధానాన్ని అమలుచేసే అంశంపై ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఆలోచన రావడం వెనక 73 ఏళ్ల వ్యక్తి ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
73 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చేతితో గీసిన పటం లక్డీ కా పుల్, సైఫాబాద్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ లూప్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఇచ్చింది. ఇప్పుడు పోలీసులు ఆ ఆలోచనను తీవ్రంగా పరిశీలిస్తున్నారు. దాదాపు ఏడాది క్రితం ఒక ఈమెయిల్ సూచనగా మొదలైన ఈ విషయం ఇప్పుడు ట్రాఫిక్ సిమ్యులేషన్ అధ్యయనం, సీనియర్ పోలీసు అధికారుల తనిఖీల వరకు వచ్చింది. అదే సమయంలో, హైదరాబాద్ వ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి ఏర్పాట్ల కోసం ఆ శాఖ అన్వేషిస్తోంది.

73 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి పాలకోదేటి చంద్రశేఖర్.. ఒక చేతితో గీసిన మ్యాప్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఒక కీలక ఆలోచనను అందించింది. ప్రస్తుతం నగరంలోని తీవ్ర రద్దీ ఉండే లక్డీకాపూల్, సైఫాబాద్ ప్రాంతాల్లో వన్‌వే ట్రాఫిక్ లూప్ ఏర్పాటు చేసే దిశగా పోలీసులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు.
దాదాపు ఏడాది క్రితం పోలీసులకు వచ్చిన ఒక ఈమెయిల్ సూచనతో ప్రారంభమైన ఈ ప్రతిపాదన.. ప్రస్తుతం సిమ్యులేషన్ స్టడీ (Traffic simulation study), సీనియర్ పోలీసు అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనల వరకు వచ్చింది. లక్డీకాపూల్ వంటి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో వాహనాల రాకపోకలను పునర్వ్యవస్థీకరించడానికి చంద్రశేఖర్ ఈమెయిల్ ద్వారా పోలీసులకు సూచన పంపారు. దీనిపై స్పందించిన అధికారులు ఆయన్ను నగర పోలీస్ కమిషనరేట్‌కు ఆహ్వానించి, ఆయన ఆలోచనను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తానే స్వయంగా గీసిన రూట్ మ్యాప్‌ను పోలీసులకు అందించారు.
'నేను పోలీస్ అధికారిని కాను, ఇంజనీర్‌ను అంతకన్నా కాను. నాకు తెలిసినంతలో, నా శక్తిమేరకు ఈ మ్యాప్‌ను గీసి సమర్పించాను.' అని చంద్రశేఖర్ తెలిపారు.
ఈ మ్యాప్‌లో లక్డీకాపూల్, సెక్రటేరియట్ రోడ్, రవీంద్ర భారతి, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతాలను కలుపుతూ ఒక రౌండ్ లూప్‌ను ప్రతిపాదించారు. ద్వారకా హోటల్, ఎల్ఐసీ బిల్డింగ్, తెలంగాణ అసెంబ్లీ, పబ్లిక్ గార్డెన్స్, డీజీపీ కార్యాలయం మొదలైనవి ఈ రూట్‌లో ఉన్నాయి.
ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డీ. జోయల్ డేవిస్ మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనపై ట్రాఫిక్ సిమ్యులేషన్ అధ్యయనం పూర్తి చేశామని, అయితే దీన్ని ట్రయల్ రన్‌గా చేపట్టే ముందు కొన్ని రోడ్డు అభివృద్ధి పనులు, జంక్షన్ల డిజైన్లలో మార్పులు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.
హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, జాయింట్ సీపీ జోయల్ డేవిస్, డీసీపీ (ట్రాఫిక్-1) అవినాష్ కుమార్, ఏసీపీ మోహన్ కుమార్, ట్రాఫిక్ అడ్వైజర్ వెంకట్ రామయ్యలతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ద్వారకా హోటల్, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జంక్షన్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి తదితర ప్రాంతాల్లో ఉన్న రోడ్ల పరిస్థితిని, ప్రస్తుత ట్రాఫిక్ ప్రవాహాన్ని అధికారులు సమగ్రంగా సమీక్షించారు.
'వన్‌వే లూప్ వల్ల వాహనదారులు కొద్దిగా అదనపు దూరం ప్రయాణించాల్సి వచ్చినా, ప్రయాణం సజావుగా సాగుతుంది. గతంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రవేశపెట్టిన వన్‌వే లూప్ సిస్టమ్‌కు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అక్కడ హార్నింగ్ గణనీయంగా తగ్గింది. లక్డీకాపూల్‌లో కూడా ప్రజలు ఈ పోలీసు సంస్కరణలకు సహకరించాలని కోరుతున్నాం' అని సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ సిటీలోనే కాకుండా.. ఐటీ రద్దీ ఎక్కువగా ఉండే సైబరాబాద్ పరిధిలో కూడా ఇటువంటి లూప్ సిస్టమ్‌ను సైబరాబాద్ పోలీసులు పరిశీలిస్తున్నారు. సైబరాబాద్ లూప్ రూట్: బయోడైవర్సిటీ జంక్షన్ ➔ ఐకియా ➔ మైండ్ స్పేస్ రోటరీ ➔ టైమ్స్ స్క్వేర్ రోడ్ ➔ నాలెడ్జ్ సిటీ ➔ క్వాల్‌కామ్ ➔ డల్లాస్ సెంటర్ రోడ్ ➔ మై హోమ్ భూజా ➔ తిరిగి బయోడైవర్సిటీ జంక్షన్. చుట్టుపక్కల ఉండే వాణిజ్య భవనాలు, ఐటీ పార్కుల వల్ల వచ్చే వాహనాల సంఖ్య, పార్కింగ్ వసతులు, బాటిల్ నెక్‌లను దృష్టిలో ఉంచుకుని నివేదిక తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


