...
...
Next Story

Hyderabad: 3 నెలల కిందట బైక్‌ చోరీ - చలానాలోని ఫొటో చూసి షాక్..! అసలేం జరిగిందంటే..?

హైదరాబాద్ కు చెందిన ఫైసల్ రెహ్మాన్ అనే వ్యక్తి బైక్ మూడు నెలల ముందు చోరీకి గురైంది. కానీ ఆ తర్వాత బైక్‌కు ట్రాఫిక్ చలానా రావటంతో… అందులో మరో వ్యక్తి ఫోటో కనిపించింది. దీంతో అతడు పోలీసులకు సోషల్ మీడియా వేదికగా ట్యాగ్ చేస్తూ… నా బైక్ ఇదే అంటూ ఓ పోస్ట్ రాసుకొచ్చాడు.

Published on: Apr 9, 2026, 14:48:40 IST
Advertisement

హైదరాబాద్ సిటీకి చెందిన ఫైసల్ రెహ్మాన్ అనే వ్యక్తి ద్విచక్రవాహనం చోరీకి గురైంది. ఈ ఘటన జరిగి మూడు నెలలవుతుంది. ఈ చోరీ ఘటనపై యజమాని రెహ్మాన్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు… దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ-చలానాతో వెలుగులోకి….

చోరీకి గురైన బైక్ (X/@rahman0528)
చోరీకి గురైన బైక్ (X/@rahman0528)

మూడు నెలలు గడిచినా వాహనం ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు. కట్ చేస్తే యజమాని అయిన ఫైసల్ రెహ్మాన్ ఫోన్‌కు ఈ- చలానా మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే… షాక్ అయిపోయాడు. తన బైక్ కనిపించటమే కాదు… ఓ వ్యక్తి నడపుతున్నట్లు ఉంది. వెంటనే అప్రమత్తమైన రెహ్మాన్… మరోసారి సోషల్ మీడియా వేదికగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రెహ్మాన్ ద్విచక్రవాహనానికి ఈ-చలాన్ విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మెసేజ్ పంపారు. తన వద్ద బైక్ లేదు కదా…. ఈ చలానా ఏంటా అని పరేషాన్ అయ్యాడు. ఆ తర్వాత ట్రాఫిక్ పోలీస్ వెబ్ సైట్‌కి వెళ్లి పరిశీలించాడు. ఆ సైట్‌లో తన ద్విచక్రవాహనంపై మరో వ్యక్తి కూర్చుని ఉన్న ఫొటో ఉంది. అలర్ట్ అయిన రెహ్మాన్…. తన బైక్ మూడు నెలల కిందట చోరీ అయిందని… ఈ ఫొటోలో ఉన్న వ్యక్తే నిందితుడని ట్వీట్ చేశాడు. పోలీసులకు ట్యాగ్ చేస్తూ… గతంలో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని జత చేశాడు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks