హైదరాబాద్ విమానాశ్రయంలో అమెరికా పౌరుడి మీద పైనుంచి పడిన మెటల్ ప్యానెల్

Hyderabad Airport : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోని పైకప్పు నుంచి మెటల్ ప్యానల్ కిందపడింది. అయితే ఇది ప్రయాణికుడి మీద పడటంతో అతడికి గాయాలు అయ్యాయి.

Published on: Apr 7, 2026, 11:48:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ విమానాశ్రయంలోని ఏరోబ్రిడ్జ్ పైకప్పు నుంచి ఒక పెద్ద మెటల్ ప్యానెల్ కిందపడింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుడి తలపై పడటంతో, అతనికి అంతర్గత గాయాలై, తల తిరుగుతున్నట్లుగా ఫీలయ్యాడు. పని నిమిత్తం భారతదేశానికి వచ్చాడు అమెరికా పౌరుడు దీపక్ అడోని. బెంగళూరు నుంచి వచ్చిన విమానం నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులలో తాను కూడా ఒకడినని పీటీఐకి తెలిపాడు.

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్

'నేను కొన్ని అడుగులు వేయగానే ఆ బరువైన ప్యానెల్ నా తలపై పడింది. నన్ను ఏది తాకిందో తెలియక నిల్చోవడానికి రెయిలింగ్‌ను పట్టుకున్నాను.' అని 63 ఏళ్ల అడోని చెప్పారు.

అడోని ఏరోబ్రిడ్జ్ గోడకు ఆనుకుని ఉండగా, అతని వెనుక ఉన్న జైనాబ్ సయ్యద్ అనే యువతి సహాయం కోసం పరుగెత్తుకొచ్చి, కేకలు వేసింది. సుమారు 30 నిమిషాల తర్వాత అడోనిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. వైద్యుని నివేదిక ప్రకారం సీటీ స్కాన్‌లో మెడ వెన్నెముకలో మార్పులు గుర్తించారు. అంతేకాదు.. డిస్క్‌లో ఉబ్బులు, తలకు గాయం ఉన్నట్లు తేలింది.

అయితే వెన్నెముక సమస్య ముందు నుంచే ఉన్నదా లేక జరిగిన ప్రమాదం వల్ల వచ్చిందా అనేది స్పష్టంగా తెలియలేదు. 'మొదట్లో నేను బాగానే ఉన్నాను, కానీ 30 నిమిషాల్లోనే నాకు కళ్లు తిరగడం మొదలైంది, అంతేకాకుండా నేను నత్తిగా మాట్లాడటం మొదలుపెట్టాను. జైనాబ్ నాతో పాటు అంబులెన్స్‌లో ప్రయాణించి, అమెరికాలో ఉన్న నా భార్యతో మాట్లాడటానికి సమయం కేటాయించింది. ఆమె మంచి మనిషి.' అని అడోని చెప్పాడు.

ఆసుపత్రిలో వైద్యులు సీటీ స్కాన్‌తోపాటు ఎంఆర్ఐ కూడా నిర్వహించారు. ఆ ప్రక్రియ అంతా జరుగుతున్నప్పుడు తాను నిలబడలేకపోయానని వెల్లడించాడు అడోని. అక్కడ ఉన్నవారు తనకు సహాయం చేయాల్సి వచ్చిందన్నారు. ఒకానొక సమయంలో తాను కూర్చున్నప్పుడు గది మొత్తం తిరుగుతున్నట్టుగా ఫీలయ్యానని చెప్పుకొచ్చాడు.

సుమారు 7-8 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు ఉన్న అల్యూమినియం ప్యానెల్ ఊడిపోయి కింద పడటానికి కారణం ఏంటో తెలియరాలేదు. సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు హైదరాబాద్ విమానాశ్రయ అధికారి ఒకరు తనతో పాటే ఉన్నారని చెప్పారు.

వైద్యులు అతనికి మెడ పట్టీ ధరించమని సలహా ఇచ్చాడు. మెడ, తలనొప్పికి నొప్పి నివారణ మందులను ఇచ్చారు. తాను వెంటనే అమెరికాకు తిరిగి వెళ్లనని, తన పరిస్థితిపై ఒక అంచనా వచ్చిన తర్వాత వెళ్తానని అడోని అన్నాడు.

ఈ దురదృష్టకర సంఘటన పట్ల తాము తీవ్రంగా చింతిస్తున్నామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అడోనికి తీవ్రమైన లేదా పెద్ద గాయాలు ఏమీ కాలేదని కూడా వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించడానికి విమానాశ్రయ నిర్వహణ బృందాలు ఏరోబ్రిడ్జ్ పైకప్పు ప్యానెళ్ల భద్రతా తనిఖీ నిర్వహించాయని ఒక ప్రకటన తెలిపింది.

విమానాశ్రయ అధికారులు, అత్యవసర వైద్య బృందాలు ప్రయాణికుడు దీపక్ అడోనికి వెంటనే చికిత్స అందించారని అధికారులు వెల్లడించారు. అవసరమైన అన్ని పరిశీలనలు, పరీక్షలు పూర్తి చేసిన తర్వాత కోలుకున్నాడని నిర్ధారించి, డిశ్చార్జ్ చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More