పప్పీ, స్నూపీలకు ప్రత్యేక సెంటర్లు.. సంక్రాంతికి వెళ్తూ పెట్ హాస్టళ్లలో వదిలిన జనాలు

సంక్రాంతికి హైదరాబాద్ దాదాపు సగం కంటే ఎక్కువ ఖాళీ అయింది. చాలా మంది సంక్రాంతికి వెళ్తూ.. తమ పెంపుడు కుక్కలను పెట్ హాస్టళ్లలో వదిలి వెళ్లారు. ఇప్పుడు వీటికి బాగా డిమాండ్ ఉంది.

Published on: Jan 13, 2026, 17:53:45 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొంతమంది పెంపుడు జంతువులు లేకుండా ఉండలేరు. పెట్ అంటే కొందరికి ప్రాణం. అలా అని సంక్రాంతికి వెళ్తూ.. ఇంటికి తీసుకెళ్దామంటే.. వాటికే ఇబ్బంది. దీంతో హైదరాబాద్‌లో పెంపుడు జంతువుల హాస్టళ్లు, బోర్డింగ్ సౌకర్యాలకు డిమాండ్ బాగా పెరిగింది.

పెట్ హాస్టళ్లలో పెంపుడు జంతువులు (HT Telugu)
పెట్ హాస్టళ్లలో పెంపుడు జంతువులు (HT Telugu)

తమ స్వస్థలాలకు ప్రయాణించే చాలా మందికి తమ పెంపుడు జంతువులను తీసుకెళ్లడం కష్టంగా ఉంది. ఇంట్లో ఉంచి సంరక్షకులకు అప్పజెప్పాలనుకుంటే.. పెంపుడు జంతువులకు సరిగ్గా ఆహారం ఇస్తారా లేదా అనే ఆందోళనలు, కొత్త వ్యక్తులకు అలవాటు పడటానికి పెంపుడు జంతువులు ఇష్టపడకపోవడంలాంటి సమస్యలు ఉంటాయి. దీంతో ప్రొఫెషనల్ బోర్డింగ్ సేవలకు డిమాండ్‌ను పెంచాయి.

హైదరాబాద్ నగరం అంతటా పెంపుడు జంతువుల హాస్టళ్లు.. టీకా రికార్డులు, మొత్తం ఆరోగ్యాన్ని ధృవీకరించిన తర్వాత మాత్రమే జంతువులను చూసుకోవడానికి అనుమతి ఇస్తాయి. అవసరమైన అన్ని టీకాలు వేసి, జంతువు ఆరోగ్యంగా ఉందని కన్ఫామ్ అయితేనే పెంపుడు జంతువులను అనుమతిస్తామని చెబుతున్నారు.

గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నాగోల్, హిమాయత్‌నగర్‌తోపాటు అనేక ప్రాంతాల్లో పెట్ హాస్టళ్లు పెంపుడు కుక్కలతో బిజీబిజీగా ఉన్నాయి. రోజువారీ ఛార్జీలు.. పెంపుడు జంతువు బ్రీడ్, వయస్సు, బరువుపై ఆధారపడి ఉంటాయి. ధరలు రోజుకు రూ.400 నుండి ప్రారంభమై రూ.1,500 వరకు ఉంటాయి. అదనపు సౌకర్యాలు కావాంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తారు.

ఎయిర్ కండిషన్డ్, నాన్ ఎయిర్ కండిషన్డ్ గదులు కూడా అందుబాటులో ఉంటాయి. సింగిల్, డబుల్, ట్రిపుల్ షేరింగ్ ఆప్షనన్స్ కూడా దొరుకుతాయి. ఎంచుకున్న ప్యాకేజీ ఆధారంగా సాధారణ వాకింగ్, ప్రాథమిక శిక్షణ, చికెన్ లేదా మటన్‌తో సహా కావాల్సిన భోజనం ఉంటాయి. చాలా కేంద్రాలు 24 గంటల పర్యవేక్షణను అందిస్తాయి. శీతాకాలంలో పెంపుడు జంతువులను వెచ్చగా ఉంచడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉన్నాయి.

అయితే ఈ పెట్ హాస్టళ్లలో కొన్ని పెంపుడు జంతువులకు నచ్చకపోవచ్చు. యజమానిపై బెంగతో అనారోగ్యంపాలైన ఘటనలు చూస్తుంటాం. అన్ని పెట్ కేర్ సెంటర్లు ఒకేలా ఉంటాయని చెప్పలేం. ఇంటి నుంచి దూరంగా వెళ్తూ.. పెట్ హాస్టళ్లలో పెట్టిన శునకాలు కొన్ని రోజుల తర్వాత చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More