...
...
Next Story

ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 : భారీ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను ఛేదించిన హైదరాబాద్‌ పోలీసులు - బ్యాంకర్లతో సహా 52 మంది అరెస్ట్!

Hyderabad Police Operation Octopus 2.0 : దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ సైబర్‌ మోసాల నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారు. 32 మంది బ్యాంకు అధికారులు, 52 మందిని అరెస్ట్ చేశారు.

Published on: Apr 19, 2026, 20:26:05 IST
Advertisement

Hyderabad Police Operation Octopus 2.0 : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సైబర్ మోసగాళ్ల నెట్‌వర్క్‌పై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. తొమ్మిది రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన పోలీసులు.. బ్యాంకింగ్ అధికారులే సూత్రధారులుగా సాగుతున్న భారీ సైబర్ మోసాల ముఠాను గుట్టురట్టు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ 'ఆపరేషన్ ఆక్టోపస్ 2.0' వివరాలను వెల్లడించారు.

9 రాష్ట్రాల్లో సోదాలు…

సైబర్‌ మోసాలు - భారీ నెట్‌వర్క్‌ను ఛేదించిన హైదరాబాద్‌ పోలీసులు (Image: Pixabay)
సైబర్‌ మోసాలు - భారీ నెట్‌వర్క్‌ను ఛేదించిన హైదరాబాద్‌ పోలీసులు (Image: Pixabay)

‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌-2.O’ పేరుతో నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో మొత్తం 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి, బ్యాంకు అధికారులు సహా 52 మంది నిందితులను అరెస్టు చేశారు. పెట్టుబడి స్కామ్‌లు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను బెదిరించి భారీగా సొమ్ము దోచుకుంటున్న ముఠాలకు అండగా నిలుస్తున్న బ్యాంకు అధికారులే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది.

నిందితుల్లో 32 మంది బ్యాంకు అధికారులు, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నారు. సైబర్‌ నేరగాళ్లతో కుమ్మక్కైన కొందరు బ్యాంకు అధికారులు.. వారి కోసం అక్రమంగా బ్యాంకు ఖాతాలు (మ్యూల్ అకౌంట్స్) తెరిచి ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ డీసీపీ వి. అరవింద్‌ బాబు, ఏసీపీ ఆర్‌.జి. శివ మారుతి నేతృత్వంలో 16 ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ జరిపిన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు ఏకంగా 350 బ్యాంకు ఖాతాలను వినియోగించారు.

ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్‌ కేసులతో సంబంధం ఉంది. వీటి ద్వారా దాదాపు రూ.150 కోట్ల మేర మోసాలు జ‌రిగిన‌ట్లు దర్యాప్తులో తేలింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks