...
...
Next Story

హైదరాబాద్ పోలీసుల సంక్రాంతి సేఫ్టీ అలర్ట్.. చైనా మాంజాలపై వార్నింగ్!

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు జనాలకు పలు సూచనలు చేశారు. మరోవైపు పతంగుల కోసం చైనా మాంజాలు వాడొద్దని హెచ్చరించారు.

Published on: Jan 4, 2026, 18:31:47 IST
Advertisement

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న కొద్దీ, హైదరాబాద్ నుండి చాలా కుటుంబాలు తమ స్వస్థలాలకు ప్రయాణిస్తాయి. చాలా రోజులు తమ ఇళ్లను తాళం వేసి ఉంచుతాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు సూచలను జారీ చేశారు. జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఊర్లకు వెళ్ళే ముందు, మీ సమీప పోలీస్ స్టేషన్ లేదా బీట్ ఆఫీసర్‌కు తెలియజేయమని పౌరులను కోరుతున్నట్టుగా హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. తద్వారా పోలీస్ సిబ్బంది సాధారణ గస్తీలో భాగంగా అలాంటి ఇళ్లను నిఘా ఉంచగలుగుతారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

హైదరాబాద్ సీపీ సజ్జనార్
హైదరాబాద్ సీపీ సజ్జనార్

అదే సమయంలో ప్రయాణించేటప్పుడు నగదు, బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచవద్దని సీపీ సజ్జనార్ సలహా ఇచ్చారు. దయచేసి వాటిని బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ఏర్పాట్లలో భద్రపరచుకోవాలని సూచించారు. దొంగతనాలను నివారించడంలో, పండుగను మనశ్శాంతితో జరుపుకొనేందుకు ఈ సాధారణ జాగ్రత్తలు చాలా సహాయపడతాయని పేర్కొన్నారు.

'ఆధునిక పోలీసింగ్ నేరాలకు ప్రతిస్పందించడం గురించి మాత్రమే కాదు, వాటిని నివారించడం గురించి కూడా. హైదరాబాద్ పోలీసులు మీ ఇళ్ల భద్రతకు కట్టుబడి ఉన్నారు. పండుగ కాలంలో శాంతిభద్రతలను కాపాడటానికి ప్రజల సహకారం చాలా అవసరం. అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్ చేయండి.' అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు.

చైనా మాంజాలపై వార్నింగ్

చైనా మాంజాలను వాడకండని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. నిషేధించిన చైనా మాంజా విక్రయాలు మీ దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మీ సరదా కోసం చైనా మాంజాలను వాడితే.. అవి ఎదుటివారికి ప్రాణాంతకంగా మారే ప్రమాదముందని చెప్పారు.

'నిషేధించిన చైనా మాంజాను వాడొద్దు. ప్రాణాంతకమైన చైనా మాంజాతో పతంగులు ఎగురవేయవద్దు. చైనా మాంజా వాడకానికి దూరంగా ఉండండి. విక్రయాలకు సంబంధించి సమాచారం అందించండి. ద్విచక్రవాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఫుల్ హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.' అని హైదరాబాద్ పోలీసులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe