హైదరాబాద్ పోలీసులు దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠా గుట్టురట్టు చేశారు. 16 రాష్ట్రాలలో 104 మంది అరెస్టు చేశారు. రూ.36 లక్షల నగదు, 200కుపైగా మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ (సైబర్ క్రైమ్స్) అరవింద్ బాబు నాయకత్వంలో హైదరాబాద్ నగర పోలీసులు 16 రాష్ట్రాలలో సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సైబర్ క్రైమ్ సిండికేట్లపై భారీ ఎత్తున దాడి చేశారు.

‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో ఈ దాడి జరిగింది. దేశవ్యాప్తంగా సైబర్ మోసాల నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేయడంలో ఈ ఆపరేషన్ భాగం. ఇటీవలి కాలంలో పెట్టుబడి మోసాలు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలకు బాధితులు బలైపోతున్న కేసులు పెరిగాయి. ఫలితంగా వారు కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారు. సైబర్ మోసగాళ్ళు.. బెదిరింపులు, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తూ.. డబ్బులను దోచుకుంటున్నారు.
పరిస్థితి తీవ్రతను గుర్తించి ఈ అక్రమ నెట్‌వర్క్‌లకు నిర్ణయాత్మక దెబ్బ కొట్టడానికి ఆపరేషన్ ఆక్టోపస్ టీమ్ ఏర్పడింది. ఇటువంటి మోసాలు పెరగడంపై దృష్టి పెట్టిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్(CCPS), బాధితుల నిధులను స్వాహా చేయడానికి ఉపయోగించే 151 బ్యాంకు ఖాతాల సంబంధాన్ని గుర్తించింది. ఈ నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయడానికి అనుభవజ్ఞులైన అధికారులతో కూడిన 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 10 రోజుల వ్యవధిలో 16 రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ ఏకకాలంలో జరిగింది.
మోసాలు చేసేందుకు కీలక పాత్ర పోషించిన 104 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. ఇందులో బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు. మోసపూరిత ఖాతాలను తెరవడానికి సహాయపడ్డారు. మోసగాళ్లతో కుమ్మక్కైనందుకు అరెస్టు చేశారు. పట్టుబడిన వ్యక్తులు భారతదేశం అంతటా నమోదైన 1,055 సైబర్ మోసం కేసులతో సంబంధం కలిగి ఉన్నారు. వీరి మొత్తం మోసం సుమారు రూ.127 కోట్ల వరకు ఉంది. ఏమేం స్వాధీనం చేసుకున్నారంటే..
- మొబైల్ ఫోన్లు: 204
- సిమ్ కార్డులు: 141
- బ్యాంక్ పాస్‌బుక్‌లు: 152
- డెబిట్/క్రెడిట్ కార్డులు: 234
- ల్యాప్‌టాప్‌లు: 26
- కార్పొరేట్/సంస్థ స్టాంపులు: 56
- స్వాధీనం చేసుకున్న నగదు: రూ.36 లక్షలు
ఈ మొత్తం ఆపరేషన్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(స్పెషల్ బ్రాంచ్) ఎస్.ఎం.విజయ్ కుమార్, డీసీపీ(సైబర్ క్రైమ్స్) అరవింద్ బాబు పర్యవేక్షణలో జరిగింది. ఈ నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేయడంలో CCPS, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లు, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది అద్భుతంగా పని చేశారు.
{{/usCountry}}ఈ మొత్తం ఆపరేషన్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(స్పెషల్ బ్రాంచ్) ఎస్.ఎం.విజయ్ కుమార్, డీసీపీ(సైబర్ క్రైమ్స్) అరవింద్ బాబు పర్యవేక్షణలో జరిగింది. ఈ నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేయడంలో CCPS, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లు, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది అద్భుతంగా పని చేశారు.
{{/usCountry}}ఆపరేషన్ ఆక్టోపస్ అనేది నిరంతరంగా కొనసాగుతుందని, ఇలాంటి సిండికేట్లను నిర్వీర్యం చేయడానికి దర్యాప్తు చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఆపరేషన్ ఆక్టోపస్ కోసం 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతిదానికీ ఒక ఇన్‌స్పెక్టర్-ర్యాంక్ అధికారి నాయకత్వం వహించారు. ఈ బృందాలను ఏకకాలంలో మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ మరియు ఒడిశాలో ఉన్న సైబర్ నేరాలకు సంబంధించిన హాట్‌స్పాట్‌లలో మోహరించారు. ఆయా రాష్ట్రాల స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని అరెస్టులు చేశారు.