...
...
Next Story

మెుంథా ప్రభావంతో హైదరాబాద్‌లో వాన ముసురు.. ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు!

అక్టోబర్ 29, బుధవారం నాడు హైదరాబాద్ వాసులు వాన ముసురుతో మేల్కొన్నారు. ఉదయం నుంచే వర్షం మెుదలైంది. మరోవైపు ప్రయాణికులు ట్రాఫిక్ కష్టాలు చూస్తున్నారు.

Updated on: Oct 29, 2025, 11:51:15 IST
Advertisement

తీవ్రమైన మెుంథా తుపాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య (కాకినాడకు దక్షిణంగా నర్సాపూర్ సమీపంలో) దాటింది. తరువాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. మెుంథా ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడుతున్నాయి.

హైదరాబాద్‌లో వర్షం(ఫైల్ ఫోటో) (PTI)
హైదరాబాద్‌లో వర్షం(ఫైల్ ఫోటో) (PTI)

తెలంగాణలోని దక్షిణ, మధ్య, ఉత్తర ప్రాంతాలలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ 29 (బుధవారం) నాగర్ కర్నూల్ జిల్లాలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని, 200 మి.మీ వరకు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

యాదాద్రి-భువనగిరి, జనగాం, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం సహా అనేక ఇతర జిల్లాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్టోబర్ 30వ తేదీన కూడా వర్షాలు పడనున్నాయి.

మరోవైపు హైదరాబాద్‌లో ప్రజలు మేఘావృతమైన ఆకాశం, చల్లని గాలులు, వాన ముసురుతో మేల్కొన్నారు. రోజంతా నిరంతరాయంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు , ఉత్తర హైదరాబాద్‌లో నిరంతరాయంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేయగా, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బుధవారం నగరంలో మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 30 నుండి నవంబర్ 1 వరకు నగరంలో ఉదయం వేళల్లో పొగమంచు లేదా మబ్బు కమ్ముకుంటుంది. IMD హైదరాబాద్ అంచనా వేసిన భారీ వర్షాల దృష్ట్యా నివాసితులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.

వర్షాల కారణంగా ఇప్పటికే నగరంలోని అనేక ప్రాంతాల్లో నీరు నిలిచి, ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్‌లో ఒక పోస్ట్‌ చేశారు. లక్డీకాపుల్, అయోధ్య జంక్షన్, పీటీఐ, మహావీర్ హాస్పిటల్, మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్, ఎన్ఎండీసీ, ఎస్డీ హాస్పిటల్, అజీజియా మసీదు నుండి మెహదీపట్నం వైపు భారీ ట్రాఫిక్, నెమ్మదిగా వాహనాల కదలిక గురించి ప్రయాణికులను హెచ్చరించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks