హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 2025లో 14 శాతం పెరిగాయి. ఇదే సమయంలో నమోదైన గృహాల మొత్తం విలువ 23 శాతం పెరిగింది. నైట్ ఫ్రాంక్ ఇండియా విశ్లేషణ ప్రకారం నెలలో రూ .4,399 కోట్ల విలువైన దాదాపు 6,600 నివాస ఆస్తులు రిజిస్టర్ అయ్యాయి. రిజిస్టర్డ్ గృహాల వెయిటెడ్ సగటు ధర కిందటి ఏడాదితో పోల్చుకంటే 5 శాతం పెరిగింది.

అయితే రూ .1 కోటి కంటే ఎక్కువ ధర ఉన్న ఆస్తులు మొత్తం రిజిస్ట్రేషన్లలో 18 శాతం ఉన్నాయి. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. అవి హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి. ప్రాథమిక, ద్వితీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ల నుండి ఈ లావాదేవీలు ఉన్నాయి. డిసెంబర్ 2025లో హైదరాబాద్‌లో రూ .1 కోటి కంటే ఎక్కువ ధర ఉన్న గృహ రిజిస్ట్రేషన్లు సంవత్సరానికి 37 శాతం పెరిగాయి. ఇది డిసెంబర్ 2024లో 15 శాతం నుండి 18 శాతం పెరిగింది.
విలువ పరంగా చూసుకుంటే.. కోటి రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న గృహాలు.. మొత్తం లావాదేవీ విలువలో 48 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రీమియం హౌసింగ్ కోసం నగరంలో జనాలు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అర్థమవుతోంది. హైదరాబాద్‌లో చాలా రిజిస్టర్డ్ గృహాలు 1,000 నుండి 2,000 చదరపు అడుగుల మధ్య ఉన్నాయి. ఇది మొత్తం రిజిస్ట్రేషన్లలో 68 నుంచి 69 శాతంగా ఉన్నాయి. ఇక 2,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ యూనిట్లు 2025లో 14-16 శాతం వాటాను కలిగి ఉన్నాయని విశ్లేషణ చూపించింది.
2025 డిసెంబరులో మొదటి ఐదు ఒప్పందాలలో రూ.7 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో నాలుగు రంగారెడ్డి (వెస్ట్), ఒకటి హైదరాబాద్ (సెంట్రల్)లో నమోదయ్యాయి. సంవత్సరంలో మొత్తం రిజిస్ట్రేషన్లు స్వల్పంగా తక్కువగా ఉన్నప్పటికీ, లావాదేవీ విలువలో 11 శాతం పెరుగుదల చూపించింది. ఇది అధిక విలువ గృహాల వైపు మార్పును సూచిస్తుంది. రూ .కోటి కంటే ఎక్కువ ధర ఉన్న గృహాల రిజిస్ట్రేషన్లు ఏడాది మెుత్తంలో 35 శాతం పెరిగాయి. అధిక విలువ కలిగిన నివాసాలపై కొనుగోలుదారుల ఆసక్తిని చూపిస్తుందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ అన్నారు.
{{/usCountry}}2025 డిసెంబరులో మొదటి ఐదు ఒప్పందాలలో రూ.7 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో నాలుగు రంగారెడ్డి (వెస్ట్), ఒకటి హైదరాబాద్ (సెంట్రల్)లో నమోదయ్యాయి. సంవత్సరంలో మొత్తం రిజిస్ట్రేషన్లు స్వల్పంగా తక్కువగా ఉన్నప్పటికీ, లావాదేవీ విలువలో 11 శాతం పెరుగుదల చూపించింది. ఇది అధిక విలువ గృహాల వైపు మార్పును సూచిస్తుంది. రూ .కోటి కంటే ఎక్కువ ధర ఉన్న గృహాల రిజిస్ట్రేషన్లు ఏడాది మెుత్తంలో 35 శాతం పెరిగాయి. అధిక విలువ కలిగిన నివాసాలపై కొనుగోలుదారుల ఆసక్తిని చూపిస్తుందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ అన్నారు.
{{/usCountry}}