కొత్త సంవత్సరం ఈ రాశుల వారికి అద్భుతం.. గౌరవ మర్యాదలు, ఆస్తులు ఇలా ఎన్నో ఊహించని లాభాలు!
గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు దాని వల్ల కలిగే ఫలితాలను బట్టి శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజ్యపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. సమాజంలో విలువ కూడా ఉంటుంది. వీరి సలహాలను, సూచనలను ఇతరులు పాటిస్తారు. గ్రహాల సంచారం ప్రకారం చూసినట్లయితే కొత్త ఏడాది ఈ ప్రధాన గ్రహాలు బాగా అనుకూలం.
ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అయితే గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు దాని వల్ల కలిగే ఫలితాలను బట్టి శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజ్యపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వారికి సమాజంలో విలువ కూడా ఉంటుంది.

వీరి సలహాలను, సూచనలను ఇతరులు పాటిస్తారు, ప్రాధాన్యత ఇస్తారు. గ్రహాల సంచారం ప్రకారం చూసినట్లయితే కొత్త ఏడాది ఈ ప్రధాన గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్న రాశుల వారికి బాగా కలిసి రాబోతుంది. ఈ రాశుల వారికి ఎక్కడ బయటైనా గౌరవం, మర్యాదలు కలుగుతాయి. మరి ఆ రాశులు వారు ఎవరు? ఆ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
కొత్త సంవత్సరం ఈ రాశుల వారికి గౌరవ, మర్యాదలు పొందుతారు, గుర్తింపు వస్తుంది
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి కొత్త సంవత్సరం శని, గురువు బాగా అనుకూలంగా ఉంటాయి. దీంతో రాజ్యపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వ గుర్తింపు కూడా ఉంటుంది. ప్రముఖుల చేత సన్మానాలు చేయించుకుంటారు. పదోన్నతులు లభించవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో కూడా ఈ రాశి వారికి బాగా కలిసి రాబోతోంది. ఆదాయం కూడా పెరుగుతుంది. విద్యార్థులకీ ఇది మంచి సమయం. ఘన విజయాలను సాధించి ఆనందంగా ఉంటారు.
2.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కొత్త సంవత్సరం శని, గురువు అనుకూలంగా ఉండడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. విదేశీ ఉద్యోగాలు లభిస్తాయి. ఆస్తి సమస్యలు కూడా తీరిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఫిక్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సంతాన ప్రాప్తి కూడా కలగవచ్చు. విశిష్టమైన వ్యక్తిగా ఈ రాశి వారు గుర్తింపు పొందుతారు.
3.మిథున రాశి
మిథున రాశి వారికి కూడా ఇదే శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఏ పనిని మొదలుపెట్టినా అది సక్సెస్‌ఫుల్‌గా పూర్తవుతుంది. విజయాలు ఉంటాయి. సంపద కూడా వృద్ధి చెందుతుంది. పదోన్నతులు, రాజ్యపూజ్యాలు పొందుతారు.
4.కన్యా రాశి
కన్యా రాశి వారికి కూడా కొత్త సంవత్సరం బాగుంటుంది. ఈ రాశి వారు చక్కని గుర్తింపును పొందుతారు. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. శని, గురువులు అనుకూలంగా ఉండడంతో పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు. ఆస్తి కలిసి వస్తుంది. షేర్లు వంటి వాటి ద్వారా ఎక్కువ లాభాలను పొందుతారు.
5.వృశ్చిక రాశి
ఈ రాశి వారికి కూడా కొత్త సంవత్సరం రాజ్యపూజ్యాలు ఉంటాయి. సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. డబ్బుకు లోటు ఉండదు. ప్రముఖులతో సంబంధాలు ఏర్పడతాయి. పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు విజయాలను అందుకుంటారు.
6.మకర రాశి
మకర రాశి వారికి కూడా ఇది శుభ సమయం. ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో మరింత ముందుకు వెళ్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. రాజకీయంగా ప్రాబల్యం ఉంటుంది. జీవితంలో సానుకూల మలుపులు ఉంటాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


