ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ జలమండలి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. దీనివల్ల నీటి లభ్యతపై ఆందోళనల నేపథ్యంలో తాగునీటి వృథా, దుర్వినియోగాన్ని నివారించడంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) పానీ మెుబైల్ యాప్‌ను ప్రారంభించింది. అంతేకాదు ప్రజలు తమ నీటి వినియోగాన్ని కనీసం 20 శాతం తగ్గించుకోవాలని కోరింది. జలమండలి ప్రధాన కార్యాలయంలో పానీ యాప్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ,ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

పానీ యాప్ ద్వారా హైదరాబాద్ నివాసితులు తమ పరిసర ప్రాంతాలలో జరుగుతున్న తాగునీటి వృథా, దుర్వినియోగంపై ఫిర్యాదు చేయవచ్చు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉన్న పౌరులు గుర్తింపు పత్రాన్ని సమర్పించడం ద్వారా వాటర్ బోర్డ్ వెబ్‌సైట్ ద్వారా సేవ్ వాటర్ వాలంటీర్స్‌గా నమోదు చేసుకోవచ్చు. వారి వివరాలు ధృవీకరించిన తర్వాత అధికారికంగా వాలంటీర్లుగా గుర్తించబడతారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.
యాప్ ద్వారా సమర్పించిన ప్రతి ఫిర్యాదు ఎస్ఎంఎస్ ఆధారిత ధృవీకరణ ద్వారా ఉంటుంది. ఆ తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తారు. ఫిర్యాదులు చేసే వాలంటీర్ల గుర్తింపు గోప్యంగా ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. నీటి దుర్వినియోగం నిజంగానే జరిగితే.. సంబంధిత వ్యక్తులకు లేదా సంస్థలకు నోటీసులు జారీ చేస్తారు. నిబంధనల ప్రకారం జరిమానాలు విధిస్తారు.
నీటి సంరక్షణకు కృషి చేసే వాలంటీర్లను ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా సమావేశమై అత్యుత్తమ వాలంటీర్లను అభినందిస్తారని, నివాస కాలనీలు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, ఇతర పరిసర ప్రాంతాల నుండి కూడా భాగస్వామ్యం కావాలని బోర్డు ప్రోత్సహిస్తోందని అధికారులు తెలిపారు.
వాహనాలు, నేలలను కడగడానికి తాగునీటిని ఉపయోగించవద్దని హైదరాబాద్ వాటర్ బోర్డు హైదరాబాద్ వాసులకు సూచించింది. ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు పొంగిపొర్లకుండా చూసుకోవాలని, లీకులను వెంటనే మరమ్మతు చేయాలని తెలిపింది. అలాగే ఇళ్లు, భవనాలలో ఇంకుడు గుంతలు, వర్షపునీటి సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
{{/usCountry}}వాహనాలు, నేలలను కడగడానికి తాగునీటిని ఉపయోగించవద్దని హైదరాబాద్ వాటర్ బోర్డు హైదరాబాద్ వాసులకు సూచించింది. ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు పొంగిపొర్లకుండా చూసుకోవాలని, లీకులను వెంటనే మరమ్మతు చేయాలని తెలిపింది. అలాగే ఇళ్లు, భవనాలలో ఇంకుడు గుంతలు, వర్షపునీటి సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
{{/usCountry}}తాగునీటిని అనవసరమైన కార్యకలాపాల కోసం వాడకూడదని బోర్డు తెలిపింది. మురుగునీటి శుద్ధి కర్మాగారాల నుండి శుద్ధి చేసిన మురుగునీటిని పార్కులు, తోటలకు నీరు పెట్టడానికి, ల్యాండ్‌స్కేపింగ్, నిర్మాణం, పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఉపయోగించాలి. ఇటువంటి అవసరాల కోసం శుద్ధి చేసిన మురుగునీటి వినియోగాన్ని సులభతరం చేయడానికి హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ డయల్-ఎ-గ్రీన్ ట్యాంకర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.