హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 99రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పొరేషన్స్‌కు సంబంధించిన ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

క్యూర్ పరిధిలో ప్రతీరోజు ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. చెత్త సేకరణకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలని సూచించారు. ఒక్కో వాహనానికి ఒక్కో ప్రాంతం చొప్పున కేటాయించి నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
డంపింగ్ యార్డులను సిద్ధం చేయండి - సీఎం రేవంత్
హైదరాబాద్ నగరం పరిధి విస్తరించిన నేపథ్యంలో ఇప్పటికే కొత్తగా గుర్తించిన డంపింగ్ యార్డులను వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కార్పోరేషన్ల వారీగా దగ్గరలోని డంపింగ్ యార్డులకు చెత్తను తరలించేలా…. అలాగే ప్రతినిత్యం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
నిర్మాణ రంగంలో వ్యర్థాలకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పోరేషన్లలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నిర్మాణ వ్యర్థాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అపరిశుభ్రత లేకుండా చూసుకోవడం, దోమల నివారణ, సీజనల్ వ్యాధుల విషయంలో నగర వాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఈ విషయంలో ముందస్తు జాగ్రత్తలు పాటింతాలని సూచించారు.
{{/usCountry}}అపరిశుభ్రత లేకుండా చూసుకోవడం, దోమల నివారణ, సీజనల్ వ్యాధుల విషయంలో నగర వాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఈ విషయంలో ముందస్తు జాగ్రత్తలు పాటింతాలని సూచించారు.
{{/usCountry}}