Garbage QR code : మీ ఇంటి గుమ్మం వద్ద కొత్త రూల్.. డోర్ టూ డోర్ చెత్త సేకరణకు క్యూఆర్ కోడ్
Hyderabad Garbage QR code : హైదరాబాద్‌లో చెత్త సేకరణకు కొత్త విధానాన్ని అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. డోర్ టూ డోర్ చెత్త సేకరణకు క్యూఆర్ కోడ్ విధానం తీసుకురానున్నారు.
చెత్త సేకరణకు జీహెచ్ఎంసీ కొత్త రూల్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాజేంద్రనగర్ జోన్ అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌గూడలోని నలంద నగర్‌లో క్యూఆర్ కోడ్ ఆధారిత ఇంటింటికీ చెత్త సేకరణ సామర్థ్యాన్ని పరీక్షించడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.

ఈ సిస్టమ్ ప్రకారం, స్వచ్ఛ ఆటో డ్రైవర్లు/యజమానులు ప్రతిరోజూ చెత్త సేకరణను స్కాన్ చేసి నమోదు చేసుకోవడానికి ప్రతి వ్యక్తిగత ఇల్లు/అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌కు క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఈ విధంగా ప్రతి వార్డులోని ఎన్ని కుటుంబాలు వాహనాలకు చెత్తను అందిస్తున్నాయో తెలుసుకోవడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.
క్యూఆర్ కోడ్ ఆధారిత ఇంటింటికీ వ్యర్థాల సేకరణ వ్యవస్థ జవాబుదారీతనాన్ని పెంచుతుందని, ప్రతి ఇంటి నుండి రోజువారీ చెత్త సేకరణ జరుగుతున్నట్టుగా క్లారిటీ వస్తుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా మార్చడంలో స్వచ్ఛ ఆటో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కమిషనర్ చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ తప్పకుండా జరిగేలా చూడాలని డిప్యూటీ కమిషనర్లతోపాటుగా కిందిస్థాయి అధికారులను ఆదేశించారు.
స్వచ్ఛ ఆటో కార్మికులకు చెత్తను అప్పగించని కుటుంబాలను గుర్తించాలని ఆర్వీ కర్ణన్ అన్నారు. వారిని ప్రతీ రోజు చెత్తను అందించేలా అవగాహన కల్పించాలన్నారు. దీనిద్వారా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని, క్లీన్ సిటీగా హైదరాబాద్ ఉంటుందని అధికారులకు వివరించారు. పారిశుధ్య కార్మికుల పనితీరు, హాజరులో నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాలను సహించబోమని కర్ణన్ హెచ్చరించారు.
పారిశుధ్య సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని కూడా జీహెచ్ఎంసీ కమిషనర్.. అధికారులను ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. పరిశుభ్రత కార్యక్రమాలలో సమాజ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అవగాహన, ఔట్రీచ్ కార్యక్రమాలకు కమిషనర్ పిలుపునిచ్చారు.
పైలట్ ప్రాజెక్ట్ సానుకూల ఫలితాలను ఇస్తే జీహెచ్ఎంసీ పరిమితుల్లో క్యూఆర్ కోడ్ ఆధారిత వ్యర్థాల సేకరణ వ్యవస్థను అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. అత్తాపూర్ సర్కిల్‌తోపాటుగా వనస్థలిపురం, కైత్లాపూర్ పరిధిలో క్యూఆర్ కోడ్ డోర్ టూ డోర్ చెత్త సేకరణ పైలట్ ప్రాజెక్టు నడుస్తోంది. కోడ్ స్కాన్ చేసేందుకు మీ ఇంటి గోడకు క్యూఆర్ అతికించే అవకాశం ఉంది. దీంతో మీ ఇంటి గుమ్మం వద్దకు కొత్త రూల్ వస్తుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


