Hockey World Cup : హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మక టోర్నీ - ఈనెల 8 నుంచి హాకీ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌

హైదరాబాద్ వేదికగా మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా వేడుక జరగనుంది. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి హాకీ (FIH) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 టోర్నమెంట్‌ను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది.

Published on: Mar 2, 2026, 08:58:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ క్రీడా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి హాకీ (FIH) ఆధ్వర్యంలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 మ్యాచ్ ను నిర్వహించనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ టోర్నమెంట్ మార్చి 8 నుంచి మార్చి 14, 2026 వరకు, హైదరాబాద్‌లోని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరగనుంది.

మార్చి 8 నుంచి ఉమెన్స్ హాకీ వరల్డ్ క్వాలిఫయర్స్
మార్చి 8 నుంచి ఉమెన్స్ హాకీ వరల్డ్ క్వాలిఫయర్స్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ టోర్నమెంట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా నిలబెట్టాలనే దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను ఆకర్షిస్తోంది.ఈ టోర్నమెంట్ 2026 మహిళల హాకీ వరల్డ్ కప్‌కు అర్హత సాధించేందుకు కీలకంగా నిలవనుంది.

పాల్గొనే దేశాలు:

  • భారత్
  • ఆస్ట్రియా
  • ఇంగ్లాండ్
  • ఇటలీ
  • కొరియా
  • స్కాట్లాండ్
  • ఉరుగ్వే
  • వేల్స్

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పర్యవేక్షణలో ఏర్పాట్లను సిద్ధం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల ఆస్ట్రో టర్ఫ్, ఆధునిక క్రీడాకారులకు కల్పించాల్సిన సాంకేతిక సదుపాయాలు, అత్యున్నత భద్రతను ఏర్పాటు చేశారు. టోర్నమెంట్ సజావుగా నిర్వహించేందుకు హాకీ ఇండియా - FIH ప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం కొనసాగుతోంది.

భారత్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మరియు ఉరుగ్వే జట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. అన్ని జట్లకు ప్రపంచ స్థాయి వసతి మరియు లాజిస్టిక్ సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ టోర్నమెంట్‌కు హాజరయ్యే అన్ని జట్లు, అధికారులు. అభిమానులకు స్వాగతం పలుకుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More