Hyderabad Traffic : వాహనదారులకు అలర్ట్ - నగరంలో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు, ఈ మార్గాల్లో వెళ్తే ఇబ్బందే!
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా దారూస్సలాంలో భారీ జల్సా జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో నేటి సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్ నగరవాసులకు పోలీసులు ముఖ్యమైన అలర్ట్ జారీ చేశారు. మిలాద్-ఉన్-నబీ పండగ సందర్భాన్ని పురస్కరించుకుని నాంపల్లి సమీపంలోని దారూస్సలాంలో ఉన్న ఏఐఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయంలో భారీ ‘జల్సా’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆగస్టు 25వ తేదీ సాయంత్రం 6:00 గంటల నుంచి ఆగస్టు 26వ తేదీ ఉదయం 4:00 గంటల వరకు ఈ సభ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో దారూస్సలాం పరిసర ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు మార్గాల్లో వాహనాల మళ్లింపు చేపట్టారు.

నగరంలో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలగకుండా… గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు కాకుండా ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) వెల్లడించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
కీలక జంక్షన్లలో మళ్లింపులు ఇవే:
- మలక్‌కుంట, బేగం బజార్ ఛత్రీ వైపు నుంచి వచ్చే వాహనాలు : దారూస్సలాం రోడ్డు వైపు వచ్చే వాహనాలను అలస్కా టి-జంక్షన్ వద్ద మళ్లించి ఎంజే బ్రిడ్జ్, ఎంజే మార్కెట్ వైపు పంపిస్తారు.
- మల్లేపల్లి ఎక్స్ రోడ్, బోయగూడ కమాన్, మంగళ్‌హాట్ రూట్ : ఈ ప్రాంతాల నుంచి దారూస్సలాం వైపు వచ్చే వాహనాలను అఘాపురా ఎక్స్ రోడ్ వద్ద టక్కర్‌వాడి, చార్మినార్ వైపు మళ్లిస్తారు.
- బజార్ ఘాట్, తాజ్ ఐలాండ్ వైపు నుంచి : దారూస్సలాం వైపు రాకుండా ఏక్ మినార్ వద్ద మళ్లించి బజార్ ఘాట్, నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు వైపు దారి మళ్లిస్తారు.
- సీతారాంభాగ్, మంగళ్‌హాట్ మార్గం : ఈ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను అఘాపురా జంక్షన్ వద్ద చార్‌కండిల్ వైపు పంపిస్తారు.
- మెహదీపట్నం, ఆసిఫ్‌నగర్ వైపు నుంచి : దారూస్సలాం వైపు వచ్చే వాహనాలను మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్దనే మళ్లించి గోకుల్ నగర్, బజార్ ఘాట్ వైపు పంపుతారు.
సభకు హాజరయ్యే ప్రజలు తమ వాహనాలను రోడ్లపై నిలిపివేయకుండా, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించకుండా పోలీసు యంత్రాంగం నిర్దేశించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
- నాలుగు చక్రాల వాహనాలు : గవర్నమెంట్ డిస్పెన్సరీ హాస్పిటల్ (సీతారాంభాగ్), రాకెట్ గ్రౌండ్.
- ద్విచక్ర వాహనాలు : అఘా దర్గా, సర్దార్ బేగ్ దర్గా, పాన్ మండి రోడ్, ఎస్‌బీఐ రోడ్.
కార్యక్రమం ముగిసే వరకు అంటే రేపు ఉదయం 4 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. వాహనదారులు ఈ ట్రాఫిక్ మళ్లింపులు గమనించి, తమ ప్రయాణాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

