...
...
Next Story

హైదరాబాద్ యూనివర్సిటీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే!

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి.

Published on: Sep 14, 2026, 19:28:07 IST
Advertisement

ఉన్నత విద్య అభ్యసించి పరిశోధనల వైపు వెళ్లాలనుకునే అభ్యర్థులకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(UoH) ఒక మంచి అవకాశాన్ని అందించింది. స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీలో తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టు భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అనూరాధా రీసెర్చ్ ఫౌండేషన్ నిధులతో చేపడుతున్న "ఫ్యాటీ లివర్ మరియు మెటబాలిక్ డిజార్డర్స్‌ను అరికట్టే గుగ్గుల్‌స్టెరాన్ ఆధారిత నానో ఫార్ములేషన్" ప్రాజెక్టులో పనిచేయడానికి అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు.

హైదరాబాద్ యూనివర్సిటీ జాబ్స్
హైదరాబాద్ యూనివర్సిటీ జాబ్స్

ప్రాజెక్ట్ అసోసియేట్-1 నెలవారీ వేతనం రూ. 30,000గా ఉంటుంది. ఏడాది పాటు ఉంటుంది. అభ్యర్థి ప్రతిభ, ప్రాజెక్టు గడువు ఆధారంగా కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోలాజికల్ సైన్సెస్ లేదా లైఫ్ సైన్సెస్ విభాగంలో ఎం.ఎస్సీ పూర్తి చేసి ఉండాలి.

నానో ఫార్ములేషన్స్, యానిమల్ స్టడీస్‌పై ప్రయోగాత్మక అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. 0 నుండి 1 సంవత్సరం అనుభవంగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అభ్యర్థుల గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు. ఈ నియామకం పూర్తిగా తాత్కాలికమైనది. యూనివర్సిటీలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాన్ని క్లెయిమ్ చేయడానికి ఎలాంటి హక్కు ఉండదు.

దరఖాస్తుదారులు రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదా ఉద్యోగంలో చేరే సమయంలో హాజరయ్యేందుకు ఎలాంటి ప్రయాణ భత్యాలు చెల్లించరు. దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన విద్యార్హతలు, అనుభవ పత్రాల జిరాక్స్‌లను తప్పనిసరిగా జతపరచాలి. కేవలం ఎంపిక చేసిన అర్హులైన అభ్యర్థులకు మాత్రమే ఈమెయిల్ లేదా లేఖ ద్వారా వివరాలను తెలియజేస్తారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు సంబంధిత సర్టిఫికెట్ల కాపీలను జతచేసి, దరఖాస్తు ఫారంలో పూర్తి చేసి పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks