డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. మూసీ పునరుజ్జీవ పనులు పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో, పారదర్శకంగా కొనసాగుతాయన్నారు.

ఈ ప్రాజెక్టులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు మార్చి 31 నుండి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా అభిప్రాయాల సేకరణ చేపడుతున్నామని భట్టి చెప్పారు. ప్రజలు తమ సూచనలను musirrdc@gmail.com మెయిల్ ఐడీకి పంపవచ్చన్నారు. ప్రజల నుండి వచ్చే ప్రతి విలువైన సూచనను అధికారులు విశ్లేషిస్తారని తెలిపారు.
'అవసరమైన పక్షంలో సూచనలు చేసిన వారితో సబ్ కమిటీ సభ్యులు నేరుగా భేటీ అవుతారు. నిర్మాణ డిజైన్లు, పునరావాసం, డిఫెన్స్ అంశాలు, బ్యాంకర్లతో చర్చల వంటి కీలక పనులను సమన్వయంతో వేగవంతం చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మా ప్రభుత్వం, ప్రజల ఆలోచనలు, అవసరాలకు అనుగుణంగా మూసీ పునరుజ్జీవ ప్రణాళికలు రూపొందించి, ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉంది.' అని భట్టి విక్రమార్క చెప్పారు.
ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి పొన్నం
అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రజావాణి కార్యక్రమంలో సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలతో వారి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.. ప్రజావాణిలో ఫిర్యాదుల ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజావాణిలో ముఖ్యంగా ఇల్లు లేని వారు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, పింఛన్లు, ధరణి ద్వారా భూరికార్డుల్లో సమస్యలు భూ భారతిలో సమస్యల పరిష్కారంపై అధికారులతో మాట్లాడారు. ప్రజావాణి ఫిర్యాదులపై సమస్యలు పరిష్కారం అయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు.
ఆర్టీసీలో వివిధ కారణాల వల్ల శాశ్వతంగా రిమూవ్ అయిన వారు తమ ఉద్యోగాలు సర్వీసులోకి తీసుకోవడంపై త్రిమెన్ కమిటీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తో మాట్లాడుతూ.. ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తు లు, వాటి పరిష్కారంపై చర్చించారు. పోలీస్ కేసులకు సంబంధించిన వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి పొన్నం.
{{/usCountry}}ఆర్టీసీలో వివిధ కారణాల వల్ల శాశ్వతంగా రిమూవ్ అయిన వారు తమ ఉద్యోగాలు సర్వీసులోకి తీసుకోవడంపై త్రిమెన్ కమిటీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తో మాట్లాడుతూ.. ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తు లు, వాటి పరిష్కారంపై చర్చించారు. పోలీస్ కేసులకు సంబంధించిన వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి పొన్నం.
{{/usCountry}}