హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్ - ఈ ఏరియాల్లో నీటి సరఫరా నిలిపివేత, లిస్ట్ ఇదే
కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్-2 పైప్‌లైన్ మరమ్మతులు జరుగుతున్నాయి. ఫలితంగా హైదరాబాద్‌లోని పలు కీలక ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి రేపటి వరకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సరఫరాకు సంబంధించి జలమండలి ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు (KDWSP) ఫేజ్–II పరిధిలో అత్యవసర మరమ్మతు పనులు చేపడుతున్నట్లు పేర్కొంది. ఫలితంగా నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం కలగనుంది.

నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీస్, వాల్వుల మార్పిడి పనులను చేపట్టనున్నారు. వీటితో పాటు స్కవర్ పైప్‌లైన్‌లో ఏర్పడిన నీటి లీకేజీలను అరికట్టేందుకు ముమ్మరంగా మరమ్మతులు నిర్వహించనున్నారు.
ఈ అత్యవసర మరమ్మతు పనులు ఇవాళ ఉదయం నుంచి మంగళవారం (అక్టోబర్ 6, 2026) సాయంత్రం 6:00 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతాయి. ఈ వ్యవధిలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడం లేదా పాక్షికంగా రావడం జరుగుతుంది. మరికొన్ని చోట్ల తక్కువ ఒత్తిడితో (లో ప్రెషర్) నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఏరియాల వారీగా వివరాలు….
ఈ పనుల కారణంగా నగరంలోని దాదాపు అన్ని ప్రధాన మండలాల పరిధిలోని ప్రాంతాలపై ప్రభావం పడనుంది. ఇందులో ఆదిబట్ల, కమ్మగూడ, గుర్రంగూడ, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కాపురి, బీరప్పగడ్డ, హబ్సిగూడ, రామంతాపూర్, వెంకట్‌రెడ్డి నగర్, ఉప్పల్, నాచారం, హెచ్‌ఎంటీ నగర్, తార్నాక, బౌద్ధనగర్, లాలాపేట్ (పాక్షికం), హస్మత్‌పేట్, ప్రకాశ్‌నగర్, మేకలమండి, భోలక్‌పూర్ (పాక్షికం), పద్మారావునగర్, బేగంపేట్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, పట్టిగడ్డ, నల్లగుట్ట, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ, బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్, సీతాఫల్‌మండి, మెట్టుగూడ, వైశాలీనగర్, మీర్‌పేట్, బడంగ్‌పేట్, ఏఆర్‌సీఐ, బాలాపూర్, మైసారం, బార్కాస్, ఎన్‌పీఏ, శంషాబాద్, మధుబన్ మరియు ప్రశాసన్‌నగర్ (పాక్షికం) ఉన్నాయి.
నీటి సరఫరా నిలిచిపోవటంతో…. ఆయా ప్రాంతాల నివాసితులు ముందుగానే తగినంత నీటిని నిల్వ చేసుకోవాలని మరియు నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

