అక్టోబర్‌లో దిమ్మ తిరిగిపోయేలా వాటర్ ట్యాంకర్ల బుకింగ్.. ఇది చలికాలమేనా?
వేసవిలో భాగ్యనగరంలో వాటర్ ట్యాంకర్ల బుకింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈసారి అక్టోబర్‌లోనూ భారీగా వాటర్ ట్యాంకర్లు బుకింగ్ అయ్యాయి.
సాధారణంగా మే, ఏప్రిల్ వంటి వేసవి కాలంలో కనిపించే నీటి ఎద్దడి దృశ్యాలు ఈసారి అక్టోబర్ నెలలోనే భాగ్యనగరంలో కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మెున్నటి అక్టోబర్ నెలలో ఏకంగా 2.20 లక్షలకు పైగా వాటర్ ట్యాంకర్ బుకింగ్‌లు నమోదై రికార్డు సృష్టించాయి. గతేడాది అక్టోబరులో కేవలం 87 వేల ట్యాంకర్లు మాత్రమే బుక్ అవ్వగా, ఈసారి అది రెట్టింపు కంటే ఎక్కువ కావడం నగరంలో నెలకొన్న నీటి తీవ్రతకు అద్దం పడుతోంది.

సాధారణంగా వర్షాకాలంలో రోజూ 1,500 నుంచి 2,000 ట్యాంకర్లకు మించి డిమాండ్ ఉండదు. కానీ ఎల్ నినో ప్రభావంతో ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడమే దీనికి ప్రధాన కారణం. లోటు వర్షపాతం కారణంగా భూగర్భ జలాలు పెరగకపోగా, భానుడి తాకిడికి రోజురోజుకూ మరింత అట్టడుగుకు పడిపోయాయి.
అపార్ట్మెంట్లు, ఇళ్లలోని బోర్‌వెల్స్ చుక్క నీరు రాక ఆగిపోవడం లేదా పూర్తిగా ఎండిపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా జలమండలి ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వచ్చింది. దీంతో అక్టోబరు నెల నుంచే ప్రతిరోజూ 7,000కు పైగా ట్యాంకర్లు బుక్ అవుతున్న పరిస్థితి ఏర్పడింది.
నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, టీఎన్జీవోస్ కాలనీ వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో నీటి కొరత పరాకాష్టకు చేరింది. ఇక్కడి ఒక్కో ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ప్రతిరోజూ 250 నుంచి 300 ట్యాంకర్లు సరఫరా అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. హాస్టళ్లు, పీజీలు, ఐటీ కంపెనీలు, భారీ నివాస కాంప్లెక్స్‌లు అధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో రోజువారీ అవసరాలకు ట్యాంకర్ల కోసం క్యూ కడుతున్నారు.
వర్షాకాలం ముగిసే సమయంలోనే ఈ స్థాయిలో నీటి ఎద్దడి ఏర్పడటంతో, రాబోయే వేసవి కాలాన్ని తట్టుకోవడానికి వాటర్ బోర్డు (HMWSSB) ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలకు ఇతర సమీప ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి ట్యాంకర్లను మళ్ళిస్తున్నారు. నిర్మాణ రంగాలు, పార్కులు, రోడ్లు, ఇతర అవసరాలకు శుద్ధి చేసిన మురుగునీటిని ఉపయోగించాలని వాటర్ బోర్డు ప్రజలకు సూచిస్తోంది.
మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీలు) నుంచి సరఫరా చేసే శుద్ధి చేసిన నీటి నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుద్ధి చేసిన నీటిని నిర్మాణ రంగం, గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్ తదితర తాగేతర అవసరాలకు విస్తృతంగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నానక్‌రామ్‌గూడ, ఖాజాగూడ ఎస్టీపీలను సందర్శించిన ఆయన.. శుద్ధి చేసిన నీటి నాణ్యత, గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ఫిల్లింగ్ స్టేషన్లు, సరఫరా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
శుద్ధి చేసిన నీరు పునర్వినియోగానికి నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో నిరంతరం పరీక్షించాలని ఆదేశించారు. బీవోడీ, సీవోడీ, టీఎస్ఎస్, పీహెచ్ తదితర నాణ్యత పారామీటర్లను క్రమం తప్పకుండా పరిశీలించి, ఫలితాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. నీటి శుద్ధి ప్రక్రియలో ప్రతి దశలోనూ ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


