HYDRAA : ప్లాట్‌లు కొనే ముందు అన్నీ చెక్ చేసుకోండి - హైడ్రా కీలక సూచనలు
ప్లాట్‌లు కొనే ముందు లోతుగా విచారించుకోవాలని హైడ్రా మరోసారి సూచించింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఏమైనా ఉన్నాయా..? అనుమతి పొందిన లే ఔటా.. కాదా..? ఇంటి నంబరు చూపించి ప్లాట్లను, బై నంబర్లతో ప్లాట్లను అమ్ముతున్నప్పుడు అన్ని వివరాలను చెక్ చేసుకోవాలని స్పష్టం చేసింది.
ప్లాట్, ఇంటి స్థలం కొనేటప్పడు లోతుగా విచారించాలని హైడ్రా సూచించింది. అన్నీ సరిగా ఉంటేనే ముందుకు వెళ్లాలని స్పష్టం చేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఏమైనా ఉన్నాయా..? అనుమతి పొందిన లే ఔటా.. కాదా..? ఇంటి నంబరు చూపించి ప్లాట్లను, బై నంబర్లతో ప్లాట్లను అమ్ముతున్నప్పుడు మరింత అప్రమత్తంగా పరిశీలించి కొనుక్కోవాలని పేర్కొంది.

అనుమతులు పరిశీలించుకోండి - హైడ్రా
గేటెడ్ కమ్యూనిటీ అంటూ ప్లాట్లు, విల్లాలు అమ్ముతున్నప్పుడు ఆ అనుమతులను పరిశీలించాలని హైడ్రా కోరింది. గేటెడ్ కమ్యూనిటీ అయితే తన సొంత స్థలంలోంచి చుట్టుపక్కల కాలనీలకు కనీసం 40 అడుగుల దారి చూపించారా లేదా అనేది పరిశీలించి కొనాలంది. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా ఈ హెచ్చరికలు చేసింది.
సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు రాగా వాటిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వాటిని పరిశీలించారు. ఫిర్యాదుదారుల ముందే గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజీల ఆధారంగా పరిశీలించి.. పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.
ఫిర్యాదులు ఇలా…..
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం, పాటి విలేజ్‌లోని సర్వే నంబరు 184 నుంచి 187తో పాటు పలు సర్వే నంబర్లలో మొత్తం 92 ఎకరాల పరిధిలో 1100ల ప్లాట్లతో ఆనందనగర్ కాలనీ పేరుతో లే ఔట్ వేశారు. ఇందులో కొన్ని ఎల్ ఆర్ ఎస్ కూడా అయ్యాయి. 1980 గ్రామ పంచాయతీ లే ఔట్ అయ్యింది కాని మ్యూటేషన్ కాలేదు. తర్వాత వారసులతో పాటు.. గతంలో భూమిని అమ్మిన రైతులు కొత్తగా పాస్ పుస్తకాలు సృష్టించి వేరేవాళ్లకు అమ్మడం చేశారు.
ఇలా 92 ఎకరాల లే ఔట్‌లో దాదాపు 32 ఎకరాల వరకూ ఉన్న భూమి వివాదంలోకి మారింది. ఇదే విషయాన్ని హైడ్రా ప్రజావాణిలో పలువురు ప్లాట్ యజమానులు ఫిర్యాదు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో తమ ప్లాట్లను కబ్జా చేసి మరో లే ఔట్ వేసి అమ్మేయాలని చూస్తున్నారని బాధితులు వాపోయారు. ఇప్పటికే ఎల్ ఆర్ ఎస్ కూడా కొన్ని ప్లాట్లు అవ్వడంతో పాటు.. లే ఔట్‌ను పరిశీలించి న్యాయం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హామీ ఇవ్వడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.
సంగారెడ్డి అమీన్‌పూర్ చెరువులో తమ లే ఔట్ మునిగిపోయిందని.. చెరువులోంచి నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వరుసగా చాలా లే ఔట్‌లు గంగలో కలిసిపోయాయని సెక్రటేరియట్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో వాపోయారు. చెరువు ఎప్‌టీఎల్ ను నిర్ధారించి తమ లే ఔట్‌లు మునగకుండా చూడాలని.. తప్పనిసరి పరిస్థితి ఉంటే వెంటనే తగిన విధంగా నష్ట పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
మేడ్చల్ జిల్లా కాప్రామండలంలోని జీఆర్ రెడ్డి నగర్ హెచ్ ఎండీఏ లే ఔట్. ఆ లే ఔట్‌లో మొ్తం 4 పార్కులుండగా.. ఒక పార్కులో ఒకదాని తర్వాత ఒకటిగా దేవాలయాలు వచ్చేస్తున్నాయని.. అక్కడి నివాసితులు వాపోయారు. మొత్తం 197వరకూ ఉన్న ప్లాట్ల నివాసితులకు వినియోగంలో ఉండాల్సిన పార్కు స్థలంలో గుడులు నిర్మించడం.. ఈ తతంగం వెను కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులుండడం బాధాకరమని పేర్కొన్నారు. లే ఔట్ ప్రకారం పార్కుఉండేలా చూడాలని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా బాలానగర్, శోభనా కాలనీలోని అక్షయ ఎన్‌క్లేవ్ పేరిట 7.12 ఎకరాల్లో 69 ప్లాట్లతో 1983లో లే ఔట్ వేశారు. ఇందులో రెండు స్థలాలను పార్కులకోసం కేటాయించారు. 1700ల గజాల పార్కును కబ్జా చేసేందుకు స్థానికులు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 200ల గజాలు ఆక్రమించి షెడ్డు వేసి వ్యాపారాలు చేస్తున్నారు. వెంటనే హైడ్రా స్పందించి చర్యలు తీసుకోవాలని.. పార్కును కాపాడాలని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

