Hyderabad : మాదాపూర్‌లో ‘హైడ్రా’ భారీ ఆపరేషన్ - రూ. 2200 కోట్ల విలువైన సర్కార్ భూమి సేఫ్..!
హైదరాబాద్ సిటీలో హైడ్రా మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలోని మొండికుంటలో ఆక్రమణలను తొలగించింది. రూ.2,200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించింది.
మాధాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు చేరువలో హైడ్రా భారీ ఆపరేషన్‌ను గురువారం నిర్వహించింది. వందలాది తాత్కాలిక షెడ్డులను, పదుల సంఖ్యలో ఉన్న షాపులను తొలగించింది. మొండి కుంట ఆక్రమణలను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది.

హైడ్రా భారీ ఆపరేషన్ - 11 ఎకరాలకు ఫెన్సింగ్…
చెరువుతో పాటు.. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలు తొలగించి 11 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 2200 ల కోట్ల ప్రభుత్వ ఆస్తిని హైడ్రా రక్షించింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలో గురువారం ఈ మేజర్ ఆపరేషన్ హైడ్రా చేసింది.
సర్వే నంబరు 53లోని మొండికుంటతో పాటు.. సర్వే నంబరు 55లోని ప్రభుత్వ భూమి ఎకరాలకొద్దీ ఆక్రమణలకు గురి అవుతోందని అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఆదేశాలమేరకు రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్ర స్థాయిలో విచారించింది. దాదాపు 11 ఎకరాలు కబ్జాకు గురైనట్టు హైడ్రా అధికారులు గుర్తించారు.
చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఆలయాన్ని హద్దుగా చూపించి కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడినట్టు అధికారులు నిర్ధారించారు. ఆలయం హద్దుగా పలు షాపులు, మెకానిక్ షెడ్డులు, ఐరన్ స్టీల్ షాపు ఇలా పలు రకాల షెడ్డులు వేసి వ్యాపారాలు చేస్తున్నట్టు గుర్తించారు. 30కి పైగా ఉన్న షాపుల ద్వారా నెలకు రూ. లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నారు.
ముందుగా క్షేత్రస్థాయి విచారణ - ఆపై యాక్షన్….!
మొండికుంటతో పాటు.. అక్కడ ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలపై జనవరి 31న హైడ్రా విచారణ కూడా చేపట్టింది. రెవెన్యూ అధికారులతో పాటు.. కబ్జాలకు పాల్పడిన వారు కూడా ఈ సమవేశంలో పాల్గొన్నారు. వారి సమక్షంలోనే ఆక్రమణలు జరిగినట్టు రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఎన్ ఆర్ ఎస్ సీ శాటిలైట్ చిత్రాలను పరిశీలించి కూడా ఆక్రమణలు జరిగినట్టు నిర్ధారించారు.
ఇదే విషయాన్ని కబ్జాదారులకు తెలియజేశారు. వారికి కొంత సమయాన్ని ఇచ్చి గురువారం హైడ్రా ఆక్రమణలను తొలగించే పనిని చేపట్టింది. వందల సంఖ్యలో ఉన్న తాత్కాలిక షెడ్డులను భారీ బందోబస్తు మధ్య హైడ్రా తొలగించింది. ఈ ఆక్రమణలు తొలగించిన సందర్భంలో అక్కడ స్థానికులు పెద్ద మొత్తంలో వచ్చి హైడ్రా చర్యలను అభినందించారు.
మొండికుంట చెరువును కాపాడినందుకు అక్కడ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించిన చోట పార్కులను అభివృద్ధి చేయాలని స్థానికులు ఈ సందర్భంగా హైడ్రా అధికారులను కోరారు. అలాగే చెరువును కూడా అభివృద్ధి చేసి సుందరీకరించాలని అభ్యర్థించినట్లు హైడ్రా అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

