1000 కోట్లకుపైగా విలువైన సర్కార్ భూమి సేఫ్.. కబ్జారాయుళ్లపై హైడ్రా యాక్షన్‌

మరోసారి కొన్ని కోట్ల విలువైన భూమిని కాపాడింది హైడ్రా. ఇప్పటికే హైదరాబాద్‌లో కోట్ల విలువైన భూమిని కబ్జా నుంచి కాపాడి ఆధీనంలోకి తీసుకుంది.

Published on: Feb 11, 2026, 19:27:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లో భూకబ్జాలు చేసేవారికి చుక్కలు చూపిస్తోంది. హైడ్రా ఇప్పటికే కొన్ని కోట్ల విలువైన భూమిని ఆధీనంలోకి తీసుకుంది. తాజాగా రూ.1003 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో పార్కును 150 గ‌జాల మేర క‌బ్జా చేశాడు ఓ వ్యక్థి. ఏకంగా రూ. 3 కోట్ల విలువైన భూమిని సొంతం చేసుకోవాల‌నుకున్నాడు.

హైడా యాక్షన్
హైడా యాక్షన్

అలాగే హైటెక్స్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్‌కు చేరువ‌లోని ఖానామెట్ ప్రాంతంలో ఎక‌రం రూ. 200ల కోట్లు. 5 ఎక‌రాల‌ను వెల‌మ సంఘానికి గ‌తంలో ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమి విలువ రూ. 1000 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా.. ఆ కేటాయింపుల‌పై కొంత‌మంది అభ్యంత‌రం చెప్పడంతో కోర్టు స్టే ఇచ్చింది. ఇదే అద‌నుగా ఆక్రమ‌ణ‌ల చేశారు కొందరు క‌బ్జారాయుళ్లు. ఈ రెండు క‌బ్జాల‌పై హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదులందాయి.

హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారుల‌తో హైడ్రా అధికారులు ప‌రిశీలించారు. క‌బ్జాల‌ను చేశాని కన్ఫామ్ చేసుకుని ఆక్రమ‌ణ‌ల‌ను తొల‌గించి ఫెన్సింగ్ వేశారు. ఇలా మొత్తం రూ. 1003 కోట్ల ప్రభుత్వ ఆస్తిని హైడ్రా కాపాడింది.

జూబ్లీహిల్స్‌‌లో 150 గజాలు

జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుప‌త్రి ఔట్ గేట్‌కు ఎదురుగా ఇళ్ల మ‌ధ్య దాదాపు 2 ఎక‌రాల మేర‌ పార్కు ఉంది. అక్కడ ఓ ఇంటిని కిరాయికి తీసుకుని లేడీస్ హాస్టల్ న‌డుపుతున్న వ్యక్తికి.. ఆ పార్కు స్థలంపై క‌న్ను ప‌డింది. 150 గ‌జాల మేర పార్కును ఆక్రమించాడు. కాంపౌండ్ దాటి పార్కులోకి 50 గ‌జాల మేర జ‌రిగి పాత భ‌వ‌నానికి ఆనుకుని మ‌రో నిర్మాణం చేప‌ట్టాడు. ఒక్కో అంత‌స్తులో 4 బెడ్లు ప‌ట్టేట్టు గ‌దులు నిర్మించాడు. పార్కు వైపు గేటు పెట్టి 100 గ‌జాల మేర ఫార్మ్ హౌస్ మాదిరి సొంత పార్కును అభివృద్ధి చేసుకుని వాడుకుంటున్నాడు.

పార్కు క‌బ్జాపై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు స్థానికులు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశాల మేర‌కు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. పార్కులోకి 50 గ‌జాల మేర జ‌రిగి నిర్మాణం చేప‌ట్టిన‌ట్టు నిర్ధారించుకుంది. మ‌రో 100 గ‌జాల మేర హ‌ద్దులు వేసుకుని ఆక్రమ‌ణ చేసిన‌ట్టుగా గుర్తించింది. హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశాల‌తో తాజాగా 3 అంత‌స్తుల నిర్మాణాన్ని తొల‌గించారు. పార్కు క‌బ్జా ప్రయ‌త్నాల‌కు ఫుల్ స్టాప్ పెట్టి ఫెన్సింగ్ వేశారు. క‌బ్జాకు పాల్పడిన‌వారిపై పోలీసు స్టేష‌న్లో కేసు పెట్టారు.

ఖానామెట్‌లో 5 ఎక‌రాలు

హైటెక్స్ ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌కు సమీపంలోని ఖానామెట్‌లో ఆల్ ఇండియా వెల‌మ సంఘానికి 5ఎక‌రాలు ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలం చుట్టూ ప్రీకాస్ట్ వాల్‌తో ప్రహ‌రీ నిర్మిస్తుండ‌గానే కుల సంఘాల‌కు స్థలాలు కేటాయించ‌డంపై కొంత‌మంది కోర్టుకెక్కడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదే అద‌నుగా ఆ స్థలాన్ని వెనుక వైపు నుంచి అక్కడ ఉన్న స్థానికులు మ‌ట్టిపోస్తూ క‌బ్జాచేస్తున్నార‌ని.. అదేమ‌ని అడిగితే వాచ్‌మ్యాన్‌పై దాడి చేస్తున్నార‌ని ఆ సంఘం ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో ప‌రిశీలించి క‌బ్జాల‌కు ఆస్కారం లేకుండా 5 ఎక‌రాల మేర ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డుల‌ను ఏర్పాటు చేసింది.

చెత్త వేయ‌కుండా 1.5 కిలోమీట‌ర్లు ఫెన్సింగ్‌

ప్రగ‌తిన‌గ‌ర్ చెరువు అభివృద్ధికి హైడ్రా కృషి చేస్తోంది. చెత్త వేయ‌కుండా రోడ్డు పోడవునా ఫెన్సింగ్ వేసింది. చెరువు మ‌ధ్యలో ఉన్న రోడ్డు పొడవునా చికెన్‌, మాంసం, చేపల విక్రేతలతో పాటు.. బ‌య‌ట దుకాణ దారులు కూడా వ్యర్థాలను పడేస్తున్నారని HYDRAAకు స్థానికులు ఫిర్యాదు చేశారు. జంతు వ్యర్థాలను ఇలా డంప్ చేయడం వల్ల దుర్వాసన వ‌స్తోంద‌ని పేర్కొన్నారు. 145 లారీల వ‌ర‌కూ పేరుకుపోయిన చెత్తను క్లియ‌ర్ చేశారు. చెత్త విసిరేయ‌డానికి అవ‌కాశం లేకుండా 10 మీట‌ర్ల ఎత్తులో హైడ్రా ఫెన్సింగ్ వేశారు. చెరువులో మురుగు నీరు క‌ల‌వ‌కుండా.. అభివృద్ధి ప‌నులు త్వర‌లో హైడ్రా చేప‌ట్టనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More