కొండాపూర్‌లో హైడ్రా యాక్షన్.. రూ.700 కోట్ల విలువైన 4 ఎకరాలు సేఫ్!

హైదరాబాద్‌లో విలువైన భూములను కాపాడుతుంది హైడ్రా. తాజాగా రూ.700 కోట్ల విలువైన భూములను రక్షించింది.

Published on: Feb 10, 2026, 11:04:31 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొండాపూర్‌లో భారీ భూకబ్జాపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంది. సుమారు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించింది. జంగమోని కుంట ఆక్రమణలపై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది హైడ్రా. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి మదీనగూడ మార్గం వరకు అధికారులు పరిశీలనలు చేపట్టారు.

రూ.700 కోట్ల విలువైన 4 ఎకరాలు కాపాడిన హైడ్రా
రూ.700 కోట్ల విలువైన 4 ఎకరాలు కాపాడిన హైడ్రా

సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జంగమోని కుంటను కబ్జాదారులు మట్టితో నింపి చదును చేసి, ప్లాట్లుగా మార్చి విక్రయానికి సిద్ధం చేసినట్లు గుర్తించారు. ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో రెవెన్యూ శాఖతో కలిసి హైడ్రా జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించింది. ఈ ఘటనపై కబ్జాదారులపై కేసులు నమోదు చేసిన రెవెన్యూ అధికారులు, చెరువును పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించారు. చెరువు పరిరక్షణలో భాగంగా హైడ్రా ఫెన్సింగ్ పనులు కూడా చేపట్టింది.

నార్సింగిలో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

ఇటీవలి కాలంలో హైదరాబాద్ మహానగర పరిధిలోని ప్రభుత్వ భూములను, ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాలను కాపాడటమే లక్ష్యంగా హైడ్రా దూకుడుగా వెళ్తోంది. తాజాగా నార్సింగిలో హైడ్రా కూల్చివేతలు చేసింది. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని అరుణోదయ హౌసింగ్ సొసైటీకి చెందిన సుమారు 1600 గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేశారు కొందరు.

లేఅవుట్ నిబంధనలు పాటించడం లేదని, ప్రజల కోసం కేటాయించిన పార్కు స్థలాన్ని కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగింది. సుమారు రూ.50 నుంచి 80 కోట్ల విలువైన పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి స్థలాన్ని ఆధీనంలోకి తీసుకుంది హైడ్రా. ఏళ్ల తరబడి కబ్జాదారు ఆధీనంలో ఉన్న భూమిని మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకువచ్చింది. దీంతో జనాల్లో సంతోషం వ్యక్తమైంది. స్థలాల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హైడ్రా అధికారులు హెచ్చరించారు.

హైడ్రా ఫోన్ ఇన్ కార్యక్రమం

ప్రతి శ‌నివారం ఫోన్‌-ఇన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది హైడ్రా. సెల‌వు రోజులు మిన‌హా.. ప్రతి శ‌నివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి ఒంటి గంట వ‌ర‌కూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొంది.

ఔట‌ర్ రింగురోడ్డు ప‌రిధిలో ఉన్న న‌గ‌ర ప్రజ‌లు 040-29565750, 040-29565759 ఈ రెండు ఫోను నంబ‌ర్లకు ఫోను చేసి ఫిర్యాదులు చేయ‌వ‌చ్చున‌ని తెలిపింది. చెరువులు, పార్కులు, ర‌హ‌దారులు, ప్రజావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థలాల‌ ఆక్రమ‌ణ‌లు, చెరువుల్లో మ‌ట్టి పోయ‌డం వంటి అంశాల‌పై ఫిర్యాదు చేయ‌వ‌చ్చున‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఇచీవల తెలిపారు. గ‌తంలో ప్రజ‌లు ఇచ్చిన ఫిర్యాదులు ఏవైనా ప‌రిష్కారం కాక‌పోతే.. వాటి గురించి కూడా ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో తెలుసుకోవ‌చ్చన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More