హైదరాబాద్ నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాలు, పాత కట్టడాల వల్ల ఎదురయ్యే ప్రాణనష్టాన్ని నివారించేందుకు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎప్పుడైనా కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటువంటి ప్రమాదకర కట్టడాల సమాచారాన్ని వెంటనే తమకు అందించాలని కోరుతూ…. 9000113667 అనే హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రకటించింది.

బుధవారం సాయంత్రం బెంగళూరులోని శివాజీనగర్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి ఒక ఆసుపత్రి సమీపంలో ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా…. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లో కూడా గతంలో ఇటువంటి పాత భవనాలు కూలి అమాయకులు బలిని తీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే, అకాల వర్షాలు కురుస్తున్న వేళ నగరంలో మరోసారి అలాంటి విషాదాలు చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో హైడ్రా రంగంలోకి దిగింది.
సమాచారం ఎలా అందించాలంటే…?
మీ పరిసరాల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత భవనాలు, గోడలు లేదా ఇతర నిర్మాణాలు కనిపిస్తే, వెంటనే వాటిని గుర్తించి అధికారులకు ఫోన్ చేయవచ్చు. సమాచారం ఇచ్చేటప్పుడు కింది వివరాలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు:
- ప్రమాదకరంగా ఉన్న ఆ భవనం లేదా కట్టడం ఫొటో తీయాలి.
- ఆ ప్రాంతం ఎక్కడ ఉందో తెలిపే 'కరెంట్ లొకేషన్'ను వాట్సాప్ చేయాలి.
- సమాచారం అందించిన వారి వివరాలను అధికారులు పూర్తిగా గోప్యంగా ఉంచుతారు.
- కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని హైడ్రా కోరుతోంది.
సాధారణంగా ప్రజలు వర్షాకాలంలోనే భవనాలు కూలుతాయని భావిస్తుంటారు. అయితే…. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కురుస్తున్న అకాల వర్షాల వల్ల కూడా పాత కట్టడాల గోడలు నాని బలహీనపడే అవకాశం ఉంటుంది. "ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో చెప్పలేం, కాబట్టి వర్షాకాలం వరకు వేచి ఉండకుండా ముందస్తుగా సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటాం" అని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.
ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి శిథిలావస్థలో ఉన్న భవనాల వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటే వేగంగా స్పందించి ప్రమాదాలను నివారించవచ్చని వారు పేర్కొంటున్నారు. పురాతన భవనాలను ముందే గుర్తించి… వాటిని శాస్త్రీయ పద్ధతిలో కూల్చివేయడం ద్వారా నగర ప్రజల భద్రతను నిర్ధారిస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు.
{{/usCountry}}ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి శిథిలావస్థలో ఉన్న భవనాల వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటే వేగంగా స్పందించి ప్రమాదాలను నివారించవచ్చని వారు పేర్కొంటున్నారు. పురాతన భవనాలను ముందే గుర్తించి… వాటిని శాస్త్రీయ పద్ధతిలో కూల్చివేయడం ద్వారా నగర ప్రజల భద్రతను నిర్ధారిస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు.
{{/usCountry}}