రూ.1.10 లక్షల కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా.. వచ్చే ఏడాదికి రూ.2 లక్షల కోట్లు టార్గెట్!

హైడ్రా భారీగా ప్రభుత్వ భూములను రక్షిస్తోంది. ఇప్పటి వరకు రూ.1.10 లక్షల కోట్ల విలువైన భూములను కాపాడింది.

Published on: Jun 8, 2026, 17:01:31 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లో భూ మాఫియా గుప్పిట ఉన్న ప్రభుత్వ ఆస్తులను, సహజ వనరులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా (Hydraa - Hyderabad Disaster Response and Assets Monitoring and Protection Agency) సరికొత్త రికార్డు సృష్టించింది. ఆక్రమణదారుల చెర నుంచి విలువైన ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలను కాపాడుతూ సరికొత్త మైలురాయిని అధిగమించింది.

హైడ్రా
హైడ్రా

గడిచిన రెండేళ్ల కాలంలోనే ఏకంగా రూ. 1,10,000 కోట్ల (లక్షా పది వేల కోట్లు) విలువైన ప్రభుత్వ భూములను విడిపించి, తిరిగి ప్రభుత్వానికి అప్పగించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారికంగా ప్రకటించారు.

హైదరాబాద్ నగర ప్రజల నుంచి లభించిన అపారమైన మద్దతు, ప్రోత్సాహం వల్లే ఈ అసాధ్యమైన టాస్క్ సాధ్యమైందని కమిషనర్ రంగనాథ్‌ చెప్పారు. ఇదే వేగంతో ముందుకు సాగుతూ, వచ్చే ఏడాది నాటికి కబ్జాదారుల నుంచి రక్షించిన ఆస్తుల విలువను రూ. 2 లక్షల కోట్లకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ధీమా వ్యక్తం చేశారు. భూ మాఫియా నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించాలంటే కేవలం అధికారుల శ్రమ మాత్రమే సరిపోదని, ఇందులో ప్రజలు, మీడియా భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరంలో కేవలం భవనాల కూల్చివేతలు మాత్రమే హైడ్రా పనికాదని, పర్యావరణ పరిరక్షణే తమ ప్రధాన ధ్యేయమని కమిషనర్ వివరించారు. నగరంలో కాంక్రీట్ జంగిల్ పెరిగిపోకుండా, పర్యావరణాన్ని కాపాడుతామన్నారు. కబ్జాలకు గురైన చెరువులు, కుంటలు, నాలాలను క్లెయిమ్‌ చేసి, వాటి పూర్వ వైభవాన్ని తీసుకురావడం, భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించి, రక్షించడం హైడ్రా చేస్తోంది.

ఇటీవలి కాలంలో హైడ్రా ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాలలో వేలాది కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకుంది. కోకాపేట, పుప్పాలగూడ, నార్సింగితోపాటుగా మరిన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భుములను రక్షించింది.

ఈ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించిన హైడ్రా సిబ్బంది, ఆయా భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలకు గురికాకుండా ఉండటం కోసం సదరు భూముల చుట్టూ రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇవి "ప్రభుత్వ స్థలాలు - అక్రమంగా ప్రవేశిస్తే కఠిన చర్యలు ఉంటాయ్" అని హెచ్చరిస్తూ పెద్ద ఎత్తున బోర్డులను పాతారు.

హైదరాబాద్ మహా నగరంలో వరదలు రాకుండా ఉండాలన్నా, భూగర్భ జలాలు పెరగాలన్నా నాలాలు, చెరువుల సంరక్షణ ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో హైడ్రా తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, రికార్డు స్థాయి రికవరీలు అక్రమార్కులకు బలమైన హెచ్చరికగా నిలుస్తున్నాయి. భూ ఆక్రమణలపై ఫిర్యాదులు చేయడానికి లేదా సమాచారం అందించడానికి నగర ప్రజలు నేరుగా హైడ్రా అధికారులను సంప్రదించవచ్చు. అంతేకాదు హైడ్రా చెరవులను పునరుద్ధర చేస్తోంది. బతుకమ్మ కుంటలాంటి చెరవును ఇప్పుడు అందంగా తీర్చిదిద్దింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More