హైడ్రా పునరుద్ధరించిన చెరువుల దగ్గర కైట్ ఫెస్టివల్.. పనులను పరిశీలించిన రంగనాథ్!

హైడ్రా పునరుద్ధరించిన చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్ నిర్వహిచేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ మేరకు ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ రంగనాథ్ చూస్తున్నారు.

Published on: Dec 25, 2025, 07:13:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పతంగుల పండగ నాటికి చెరువులను సిద్ధం చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13 నుంచి 15 వ‌ర‌కూ రాష్ట్ర ప్రభుత్వం ప‌తంగుల పండ‌గ నిర్వహించ‌డం ఆన‌వాయితీగా ఉంది. ఈ సారి హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల వద్ద కూడా కైట్ పెస్టివల్ నిర్వహించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం హైడ్రా క‌మిష‌న‌ర్ క్షేత్ర స్థాయిలో అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించారు. త‌మ్మిడికుంట‌, కూక‌ట్‌ప‌ల్లిలోని న‌ల్ల చెరువుల‌ను సంద‌ర్శించి ప‌లు సూచ‌న‌లు చేశారు.

పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

చెరువుల‌లోకి నేరుగా మురుగు నీరు చేర‌కుండా ఎస్‌టీపీ(సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు)ల ద్వారా శుద్ధి జ‌లాలు వ‌చ్చేలా ఏర్పాటు వెంట‌నే చేప‌ట్టాల‌ని హైడ్రా రంగనాథ్ సూచించారు. ఎస్‌టీపీల‌ను ఏర్పాటుచేసిన ప్రాంతంలో ప‌రిశుభ్రమైన వాతావ‌ర‌ణం ఉండేలా చూడాల‌న్నారు. ఇందుకు చెరువు చెంత ఉన్న ప్రభుత్వ భూమిని వినియోగించుకోవాల‌న్నారు. పార్కుల అభివృద్ధితో పాటు.. గ్రీన‌రీని పెంచాల‌ని సూచించారు. ప్రతి చెరువును ఒక ప‌ర్యాట‌క ప్రాంతంలా అభివృద్ధి చేయాల‌న్నారు. వృద్ధులు సేద‌దీరే విధంగా కూర్చునే వెసులుబాటుతో పాటు.. నీడ క‌ల్పించాల‌ని.. చిన్నారులు ఆడుకునేందుకు ప్లే ఏరియాల‌ను అభివృద్ధి చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ చెప్పారు.

ప‌తంగుల పండుగ ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో జ‌రిగేందుకు జీహెచ్‌ఎంసీ, ప‌ర్యాట‌కంతో పాటు.. వివిధ ప్రభుత్వ శాఖ‌ల‌తో స‌మ‌న్వయంగా ప‌ని చేయాల్సిన‌వ‌స‌రాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ అధికారుల‌కు సూచించారు. చెరువుల వద్ద భ‌ద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని.. తాగు నీటి వ‌స‌తితో పాటు.. మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేయాల‌న్నారు. అలాగే చెరువుల‌ను సంద‌ర్శించేందుకు వ‌చ్చిన వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డ‌కుండా సుల‌భంగా వ‌చ్చి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్న పార్కింగ్ సౌక‌ర్యాన్ని క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు.

చెరువుల పున‌రుద్ధర‌ణ ప‌నులు కొన‌సాగుతున్నందున‌.. అక్కడ దుమ్ము, దూళి ఎగ‌ర‌కుండా నీళ్లు చిల‌క‌రించాల‌న్నారు రంగనాథ్. వ‌ర్షాకాలం పూర్తి అయిన త‌ర్వాత రూపొందుతున్నందున చెరువుల్లో నీటిని నింపేందుకు ఎస్టీపీల‌ను వెంట‌నే ఏర్పాటు చేయాల‌ని సూచించారు. మూసీ న‌ది ప్రక్షాళ‌నను ప్రభుత్వం చేప‌డుతున్న వేళ‌.. చెరువుల మంచినీరు మూసీలో చేరేలా చూడాల‌న్నారు. ఇన్‌లెట్‌లు, ఔట్‌లెట్ల నిర్మాణంతో పాటు.. ప‌రిస‌ర ప్రాంతాల నుంచి వ‌ర్షపు నీరు సుల‌భంగా చెరువులోకి చేరేలా ఛాన‌ల్స్‌ను అభివృద్ధి చేయాల‌న్నారు.

హైడ్రా పునరుద్ధరించిన అంబ‌ర్‌పేటలోని బ‌తుక‌మ్మ కుంట దగ్గర బతుకమ్మ వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సంక్రాంతి సంబ‌రాల‌కు బతుక‌మ్మకుంట‌తో పాటు.. మాధాపూర్‌లోని త‌మ్మిడికుంట‌, కూక‌ట్‌ప‌ల్లిలోని న‌ల్ల చెరువు, పాత‌బ‌స్తీలోని బమ్-రుక్న్-ఉద్-దౌలా వేదిక‌లు అవుతున్నాయి. హైడ్రా మొద‌టి విడ‌త‌గా చేప‌ట్టిన ఆరు చెరువుల పున‌రుద్ధర‌ణ‌లో ఉప్పల్‌ లోని న‌ల్లచెరువు, మాధాపూర్‌లోని సున్నం చెరువు ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More