...
...
Next Story

TGSRTC i-ALERT System : టీజీఎస్ఆర్టీసీలో ఐ-అలర్ట్ సిస్టమ్.. డీజిల్ ఖర్చుల ఆదా, డ్రైవర్‌పై ఫీడ్‌బ్యాక్

TGSRTC i-ALERT System : టీజీఎస్ఆర్టీసీ ఐ-అలర్ట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. దీనిద్వారా ఖర్చులు ఆదా అవుతున్నాయని సంస్థ పేర్కొంటోంది.

Published on: Nov 22, 2026, 16:28:09 IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో తమ బీఎస్-VI బస్సులలో ఐ-అలర్ట్ సిస్టమ్ ప్రవేశపెట్టిన భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా తాము నిలిచామని ప్రకటించింది. దీని అమలు వల్ల డీజిల్ ఖర్చులలో సంస్థకు సుమారు రూ.36 కోట్లు ఆదా అయ్యాయని ఆ సంస్థ తెలిపింది.

టీజీఎస్ఆర్టీసీ ఐ-అలర్ట్ సిస్టమ్
టీజీఎస్ఆర్టీసీ ఐ-అలర్ట్ సిస్టమ్

ఆర్టీసీ ప్రకారం.. ఐ-అలర్ట్ టూల్.. డ్రైవింగ్ పద్ధతులను పర్యవేక్షించి, అంచనా వేస్తుంది. ఇది గేర్ ఎంపిక, ఇంజిన్ ఆర్పీఎం, ఐడ్లింగ్, అతివేగం, బ్రేకింగ్ పద్ధతులపై నిఘా ఉంచుతుంది. తద్వారా డ్రైవర్లు సురక్షితమైన, మరింత ఇంధన-సమర్థవంతమైన డ్రైవింగ్ పద్ధతులను ఫాలో కావాడానికి ఐఅలర్ట్ సిస్టమ్ సహాయపడుతుంది.

1,500 అశోక్ లేలాండ్ బీఎస్-VI బస్సులలో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ రోజుకు 6,603 లీటర్లు, నెలకు 1,98,090 లీటర్ల హై-స్పీడ్ డీజిల్ ఆదా చేయడానికి సహాయపడుతుంది. దీని ద్వారా నెలకు రూ.2 కోట్ల ఆదా అవుతుందని టీజీఎస్ఆర్టీసీ అంచనా వేస్తోంది.

ఇంధన వినియోగం తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గాయి. ప్రతి లీటర్ డీజిల్ 2.56 కిలోల కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తుందని అంచనా వేయగా.., ఐ-అలర్ట్ వల్ల రోజుకు 16.90 మెట్రిక్ టన్నులు, నెలకు 507.11 టన్నులు, సంవత్సరానికి 6,169.84 టన్నుల CO2 ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడిందని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది.

ఈ సిస్టమ్ ద్వారా ప్రతి డ్యూటీ తర్వాత డ్రైవర్ వ్యక్తిగత పనితీరును అంచనా వేసి.. ఫీడ్‌బ్యాక్, గ్రేడ్‌లను అందించడానికి కూడా కార్పొరేషన్‌కు వీలు కలుగుతుంది. నిర్దేశించిన గ్రీన్ బ్యాండ్ ఆర్పీఎం పరిధికి కట్టుబడి ఉండటం, ఎకానమీ గేర్లను సమర్థవంతంగా ఉపయోగించడం, ఇంజిన్ ఐడ్లింగ్‌ను తగ్గించడం, అతివేగాన్ని నివారించడం, సరైన బ్రేకింగ్ పద్ధతులను పాటించడం వంటి విషయాలపై డ్రైవర్లను పర్యవేక్షిస్తారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks