ట్రాఫిక్ సమస్యలు, జర్నీ టైమ్ తగ్గించేందు పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్
పాడ్ కార్లతో నడిచే పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌లో మూడు మార్గాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. డిసెంబర్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కోర్ అర్బన్ ఏరియా(CURE) పరిధిలో ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, కాలుష్య నియంత్రణ వంటి ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకుని కీలక ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ విధానం అమలు చేయడానికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్(PRTS) విధానంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్ నుంచి దుర్గం చెరువు, రహేజా మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ స్టేషన్ వరకు అత్యంత రద్దీగా ఉండే మార్గంలో పీఆర్టీ లైన్‌ను వెంటనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రాజెక్టు సంబంధించి డిసెంబర్ నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని, ఏడాది కాలంలో ఆ మార్గంలో పీఆర్టీ వ్యవస్థ పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఈ మార్గంలో గచ్చిబౌలి ఐకియా సమీపంలో మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసి అందులో పీఆర్టీ డిపోను నిర్మించాలని చెప్పారు.
నగరంలో ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా రాణిగంజ్ బస్టాండ్ వరకు మరో పీఆర్టీ లైన్ నిర్మించాలని సూచించారు. అసెంబ్లీ మెట్రోస్టేషన్ నుంచి రవీంద్రభారతి, సచివాలయం, ఐమాక్స్ నుంచి బేగంపేట్ ను కలుపుతూ మరో పీఆర్టీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్ మార్గంలో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేసి అందులో పీఆర్టీ డిపోను నిర్మించాలని ఆదేశించారు.
జూన్ 2 నాటికి పూర్తి చేయాలి
అంతకుముందు ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా నూతన ఆసుపత్రుల నిర్మాణ పనులు, ఆయా ఆసుపత్రులకు అవసరమైన పరికరాల కొనుగోలు, వైద్యులు, సిబ్బంది నియామకాలు ఏకకాలంలో పూర్తి కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
వచ్చే జూన్ 2వ తేదీ నాటికి అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్‌లు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ పనులు పూర్తి కావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేసి సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పారు. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను 30 వేల నుంచి 38 వేలకు పెంచామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్కో కుటుంబానికి అందించే వైద్య చికిత్సల కవరేజీని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గారు గుర్తు చేశారు.
సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్‌ల్లో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలకు సంబంధించి ఏకీకృత విధానంలో చేపట్టాలని ఆదేశించారు. వైద్య సేవల అవసరాలకు అనుగుణంగా 3 టిమ్స్‌ల మధ్య వైద్యులు, సిబ్బంది బదిలీలు జరిగేలా ఉండాలన్నారు.
ఆసుపత్రుల నిర్వహణ, హౌస్ కీపింగ్ సిబ్బందిని ఔట్సోర్సింగ్ విధానంలో చేపట్టాలని సూచించారు. టిమ్స్‌ల పర్యవేక్షణకు గ్రూప్-1 అధికారులను నియమిస్తామని తెలిపారు. నిర్వహణ, హౌస్ కీపింగ్ సిబ్బందిపై పర్యవేక్షణకు విశ్రాంత సైనికాధికారులను నియమిస్తామన్నారు. నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలకు వేరే సిబ్బంది ఉంటే, వైద్యులు పూర్తిగా వైద్య సేవలపైనే దృష్టి సారించే అవకాశం ఉంటుందని అన్నారు.
నిమ్స్‌లో శస్త్రచికిత్సలకు సమయం ఎక్కువ తీసుకుంటున్నందున సనత్‌నగర్ టిమ్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. నిమ్స్‌లో పడకలు లేకపోయినా, శస్త్రచికిత్సలకు ఆలస్యమైనా సనత్‌నగర్ టిమ్స్‌ను వినియోగించుకోవాలని చెప్పారు. ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, నిమ్స్, టిమ్స్ డైరెక్టర్లు నిత్యం సమన్వయం చేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.
టిమ్స్‌లో వైద్యుల నియామకం పూర్తయ్యే వరకు బయటి నుంచి వైద్యులను నియమించుకోవాలని, అందుకు అవసరమయ్యే మొత్తాన్ని వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వైద్యులు, సిబ్బంది నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. నిర్మాణంలో ఉన్న మరో 79 డయాలసిస్ సెంటర్ల పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
టిమ్స్‌తో పాటు బోధన కళాశాలలు, నర్సింగ్ కళాశాలల పనులు, పరికరాల కొనుగోలు ప్రక్రియ ఏకకాలంలో పూర్తవ్వాలని, అందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఏఐ పర్యవేక్షణతో ప్రభుత్వ ఆసుప్రతుల్లో వైద్యులు, సిబ్బంది హాజరు విషయంలో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ల సంఖ్య 7 కోట్ల నుంచి 9 కోట్లకు పెరగడం, ఇన్‌పేషెంట్ల సంఖ్య 23 లక్షల నుంచి 24.30 లక్షలకు పెరగడంపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి గతంలో సగటున 3.9 శాతం కేటాయించగా, గత మూడేళ్లుగా సగటున 4.8 శాతం నిధులు కేటాయిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
మూడేళ్లలోనే వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, పారామెడికల్ సిబ్బంది కలిపి 13,401 నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. మరో 5,640 నియామకాల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసే క్రమంలో వైద్యారోగ్య శాఖకు అవసరమైన నిధులను ఎంత మొత్తమైనా విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


